Share News

Peanuts: అందరూ ఎంతో ఇష్టంగా తినే వేరుశనగ.. ఈ సమస్యలు ఉన్నవారికి చాలా డేంజర్..!

ABN , Publish Date - Oct 07 , 2024 | 04:44 PM

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వేరుశనగలు కొన్ని సమస్యలున్న వారికి ప్రమాదం పెంచుతాయి.

Peanuts:  అందరూ ఎంతో ఇష్టంగా తినే వేరుశనగ.. ఈ సమస్యలు ఉన్నవారికి చాలా డేంజర్..!
Peanuts

వేరుశనగను పేదవాడి బాదం అని పిలుస్తారు. వేరుశనగలో ప్రోటీన్, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ గుప్పెడు వేరుశనగ తింటే శరీరానికి ప్రోటీన్ అందుతుందని, చాలా వరకు పోషకాహార లోపం దరిచేరదని అంటుంటారు. ఎంతో ఆరోగ్యం చేకూర్చే వేరుశనగ కొన్ని రకాల వ్యక్తులకు చాలా ప్రమాదమనే విషయాన్ని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ వేరుశనగ ఎవరికి మంచిది కాదు.. ఎవరు వీటిని తినకుండా ఉండాలి? తెలుసుకుంటే..

Sweet Potatoes: చిలకడదుంప అంటే మీకు ఇష్టమా? దీన్ని తింటే యవ్వనంగా ఉండొచ్చా?


అలెర్జీ..

కొందరికి వేరుశనగ తింటే అలెర్జీ ఉంటుంది. చర్మం పై దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి వారు వేరుశనగ తీసుకోకుండా ఉండటమే మంచిది.

ఆస్తమా..

ఆస్తమా రోగులు వేరుశనగను ఎక్కువగా తినకూడదట. వేరుశనగలో ఉండే సమ్మేళనాలు ఆస్తమా లక్షణాలను ప్రేరేపించి, సమస్యను మరింత పెంచుతాయని అంటున్నారు.

యూరిక్ యాసిడ్..

యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడేవారు దాన్ని పెంచే ఆహారాలను అస్సలు తినకూడదు. ముఖ్యంగా వేరుశనగలో ప్యూరిన్లు ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ ప్రమాదాన్ని పెంచుతాయి.

Red Apple Vs Green Apple: ఎరుపు లేదా ఆకుపచ్చ.. ఏ రంగు యాపిల్ పండు ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తుందంటే..!


బరువు..

వేరుశనగలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే బరువు ఎక్కువగా ఉన్నవారు వేరుశనగను పరిమితంగా తీసుకోవాలి. లేకపోతే బరువు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది.

కిడ్నీ..

కిడ్నీలో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడేవారు, ఇప్పటికే కుటుంబంలో కిడ్నీ రాళ్ల సమస్యతో బాధపడేవారు ఉంటే ఆ ఇంట్లో వారు వేరుశనగను పరిమితంగా తీసుకోవాలి. వేరుశనగలో ఆక్సలేట్లు ఉంటాయి. ఇవి కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి.

ఇవి కూడా చదవండి..

Facial Hair: ఫేషియల్ హెయిర్ సులువుగా ఇంట్లోనే తొలగించాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!

చర్మాన్ని యవ్వనంగా ఉంచే విటమిన్-ఇ పుష్కలంగా ఉండే డ్రై ఫ్రూట్స్ ఇవే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 07 , 2024 | 04:44 PM