Protein Deficiency: ఈ 5 లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా ప్రోటీన్ లోపమున్నట్టే లెక్క..ఇంతకీ అవేంటంటే..!
ABN , Publish Date - Apr 16 , 2024 | 11:29 AM
ఈ లక్షణాలను సకాలంలో గుర్తించడం వల్ల ప్రోటీన్ లోపాన్ని అధిగమించడానికి, ప్రోటీన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఎముకలు దృఢంగా ఉండాలన్నా, కండరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా శరీరానికి ప్రొటీన్ అవసరం. కానీ శరీరంలో ప్రొటీన్ లోపించి దాని గురించి తెలియని వారు చాలా మంది ఉన్నారు. శరీరంలో ప్రోటీన్ లోపిస్తే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను సకాలంలో గుర్తించడం వల్ల ప్రోటీన్ లోపాన్ని అధిగమించడానికి, ప్రోటీన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంతకీ శరీరంలో ప్రోటీన్ లోపిస్తే కనిపించే 5 లక్షణాలేంటో తెలుసుకుంటే..
ప్రోటీన్ లోపం లక్షణాలు..
కండర ద్రవ్యరాశి కోల్పోవడం ప్రోటీన్ లోపించినప్పుడు కనిపించే ప్రధాన లక్షణం. శరీరంలో ప్రొటీన్ లోపం ఏర్పడినప్పుడు కండర ద్రవ్యరాశి తగ్గడం ప్రారంభమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో కండరాల విషయంలో శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. అంతే కాదు.. మెరుగైన కండర ద్రవ్యరాశి కోసం ప్రోటీన్ బాగా తీసుకోవడం అవసరం.
ఇది కూడా చదవండి: అధిక రక్తపోటు తొందరగా తగ్గడానికి ఆయుర్వేదం చెప్పిన చిట్కాలివీ..!
చర్మం, గోర్లు, జుట్టు మొదలైన చోట్ల కూడా ప్రోటీన్ లోపం లక్షణాలు గుర్తించబడతాయి. శరీరంలో ప్రొటీన్ లోపం ఏర్పడినప్పుడు చర్మం ఎర్రగా కనిపించడం, గోళ్లు గరుకుగా మారడం, జుట్టు రంగు తేలికగా మారడం మొదలవుతుంది. ఈ మూడు ప్రొటీన్ లోపాన్ని సూచిస్తాయి.
ఎముకల దృఢత్వాన్ని కాపాడుకోవడంలో ప్రొటీన్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ప్రోటీన్ లేకపోతే ఎముకలలో నొప్పి మొదలవుతుంది. బలహీనమైన ఎముకలు, ఎముక పగుళ్లు పెరిగే అవకాశం కూడా ప్రోటీన్ లోపానికి సంకేతం.
కాలేయ కణాలలో కొవ్వు పేరుకుపోవడం లేదా కొవ్వు ఆమ్లాల సమస్య కూడా ప్రోటీన్ లోపం వల్ల కావచ్చు. అంతే కాకుండా ప్రొటీన్ లోపం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి కూడా దెబ్బతింటుంది. ప్రొటీన్ లోపం వల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది.
పిల్లల ఎత్తు ఆగిపోవడం లేదా సరిగా ఎదగకపోవడం కూడా ప్రొటీన్ లోపానికి సంకేతం. ఎముకలు, కండరాల పెరుగుదల, బలానికి ప్రోటీన్ సహాయపడుతుంది. శారీరక పెరుగుదలను మందగిస్తే అది ప్రోటీన్ లోపమని గుర్తించవచ్చు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
ఇవి కూడా చదవండి...
Hyderabad: ఎన్నికల వేళ బీఆర్ఎస్కు బిగ్ షాక్.. సీనియర్ నేత రాజీనామా
TS News: జూబ్లీహిల్స్ కేసులో మరోసారి దర్యాప్తు.. షకీల్ కొడుకు పాత్రపై అనుమానాలు
మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం..