Share News

Red Apple Vs Green Apple: ఎరుపు లేదా ఆకుపచ్చ.. ఏ రంగు యాపిల్ పండు ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తుందంటే..!

ABN , Publish Date - Oct 07 , 2024 | 12:10 PM

యాపిల్ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకుంటే యాపిల్ ఇవ్వమని వైద్యులు సిపారసు చేస్తారు. యాపిల్ తింటే ఆరోగ్యం తొందరగా కోలుకుంటుంది. అయితే..

Red Apple Vs Green Apple: ఎరుపు లేదా ఆకుపచ్చ.. ఏ రంగు యాపిల్ పండు  ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తుందంటే..!
Apples

రోజుకు ఒక యాపిల్ పండు తింటే వైద్యుడికి దూరంగా ఉండవచ్చని చెబుతుంటారు. దీనికి తగ్గట్టు చాలామంది యాపిల్ ను ఆహారంలో భాగం చేసుకునే వారు ఆరోగ్యపరంగా ఇతరుల కంటే మెరుగ్గా ఉంటారు. యాపిల్ పండు చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇది శరీరానికి పోషణను, విటమిన్లను, ఫైబర్ ను అందించడమే కాకుండా చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే మార్కెట్లో రెండు రకాల యాపిల్స్ చూస్తుంటాం. ఒకటి రెడ్ యాపిల్ అయితే రెండవది గ్రీన్ యాపిల్.. ఈ రెండింటిలో శరీరానికి ఏది ఎక్కువ ఆరోగ్యం చేకూరుస్తుంది. తెలుసుకుంటే..

తక్కువ కేలరీలతో ఎక్కువ ప్రోటీన్ ఉన్న శాకాహార ఆహారాల లిస్ట్ ఇదీ..!


గ్రీన్ యాపిల్..

  • గ్రీన్ యాపిల్ లో విటమిన్-ఎ, బి, సి, ఇ వంటి అనేక విటమిన్లు ఉంటాయి. ఇవి రుచికి పుల్లగా ఉంటాయి.

  • గ్రీన్ యాపిల్ లో రెడ్ యాపిల్ కంటే తక్కువ షుగర్ లెవల్స్ ఉంటాయి. ఈ కారణంగా ఇది మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది.

  • గ్రీన్ యాపిల్ లో రెడ్ యాపిల్ కంటే ఎక్కువ ఐరన్, పొటాషియం మరియు ప్రొటీన్లు ఉంటాయి.

  • కొన్ని అధ్యయనాల ప్రకారం బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి గ్రీన్ యాపిల్స్ మంచివి.

నెలరోజుల పాటు చక్కెర తినడం మానేస్తే శరీరంలో కలిగే మార్పులివే..!


రెడ్ యాపిల్..

  • రెడ్ యాపిల్ లో యాంటీఆక్సిడెంట్లు, ఆంథోసైనిడిన్స్ ఇంటాయి. కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి రుచికి తియ్యగా ఉంటాయి.

  • రెడ్ యాపిల్స్ లో కూడా ఐరన్, పొటాషియం కంటెంట్ ఉంటుంది. కానీ గ్రీన్ యాపిల్స్ కంటే తక్కువ.

  • రెడ్ యాపిల్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

  • సాధారణ ఆరోగ్యం కోసం.. చర్మ సంరక్షణలో భాగంగానూ రెడ్ యాపిల్ తీసుకుంటే మంచిది.

ఇవి కూడా చదవండి..

శరదృతువులో జబ్బులు రాకూడదంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తినండి..!

ఈ 8 టిప్స్ ఫాలో అవుతుంటే చాలు.. ఫ్యాటీ లివర్ సమస్య రానే రాదు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 07 , 2024 | 12:10 PM