Roasted Chana: వేయించిన శనగలు తింటూంటారా? వీటి గురించి ఈ నిజాలు తెలుసా..!
ABN , Publish Date - Jul 14 , 2024 | 01:48 PM
వేయించిన శనగలు భారతీయుల ఆహారంలో ఒక భాగం. వీటిని స్కూల్ పిల్లల నుండి పెద్దల వరకు అందరూ తింటూ ఉంటారు. మొదట్లో వీటిని స్నాక్ గానే తీసుకునేవారు. ప్రయాణాలలోనూ, సినిమాలు చూస్తూ, బస్టాప్ ల దగ్గర, స్కూళ్ల ముందు ఇవి ఖచ్చితంగా తారసపడుతూనే ఉంటాయి. అయితే..
వేయించిన శనగలు భారతీయుల ఆహారంలో ఒక భాగం. వీటిని స్కూల్ పిల్లల నుండి పెద్దల వరకు అందరూ తింటూ ఉంటారు. మొదట్లో వీటిని స్నాక్ గానే తీసుకునేవారు. ప్రయాణాలలోనూ, సినిమాలు చూస్తూ, బస్టాప్ ల దగ్గర, స్కూళ్ల ముందు ఇవి ఖచ్చితంగా తారసపడుతూనే ఉంటాయి. అయితే వేయించిన శనగలు ఈ మధ్యకాలంలో ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా బాగా వైరల్ అవుతున్నాయి. వీటిని రోజూ తీసుకుంటూ ఉంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలుంటాయని ఆహార నిపుణులు అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే..
ఈ సమస్యలున్న వారు ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీరు తాగకూడదు..!
వేయించిన శనగలలో ప్రోటీన్ అద్బుతంగా ఉంటుంది. ఇది కణాల నిర్మాణం, మరమ్మత్తు, కణాల పెరుగుదలకు, కండరాల ఆరోగ్యానికి, కండరాలు దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ గుప్పెడు వేయించిన శనగలు తీసుకుంటే మంచిదట.
వేయించిన శనగలు పోషకాల పవర్ హౌస్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వీటిలో విటమిన్లు, కాల్షియం, ఐరన్, పిండి పదార్థాలు మొదలైనవన్నీ ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి.
కాల్చిన శనగలలో తక్కువ గ్లైకమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మధుమేహం ఉన్నవారికి కూడా చాలా మంచిది. మధుమేహం ఉన్నవారు ఆకలి కోరికలు నియంత్రించుకోవాలంటే స్నాక్స్ లో భాగంగా వేయించిన శనగలు తీసుకోవచ్చు.
అంజీర్ తింటే ఈ 7 రకాల వ్యక్తులకు భలే లాభాలు..!
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం ఎంతో అవసరం. వేయించిన శనగలు సమతుల ఆహారంలో ఒక భాగం. సమతుల ఆహారంలో రోజుకు 100గ్రాముల వరకు వేయించిన శనగలను తీసుకోవచ్చు.
వేయించిన శనగల గురించి మరొక షాకింగ్ నిజం ఏమిటంటే వీటిని తినడం వల్ల మానసిక ఆరోగ్యం, మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. శనగలలో ఉండే పోషకాలు మెదడు పనితీరును ప్రోత్సహిస్తాయి.
జాపత్రిని ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే ప్రయోజనాలివే..!
తెల్ల జట్టును మూలాల నుండి నల్లగా మార్చే సూపర్ టిప్స్..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.