Roasted Chickpeas: వేయించిన శనగల పొట్టు తీసి తింటే బెస్టా? పొట్టు తీయకుండా తింటే బెటరా?
ABN , Publish Date - Aug 15 , 2024 | 10:19 AM
శనగలు శాకాహారులకు చాలా మంచి ప్రోటీన్ ఆహారం అనడంలో సందేహం లేదు. అయితే వేయించిన శనగల మీద పొట్టు తీసి తినడం కొందరికి అలవాటు. మరికొందరు పొట్టుతోనే తింటూ ఉంటారు.
వేయించిన శనగలు భారతీయుల చిరుతిండిలో భాగం. ఒకప్పుడు సినిమా హాళ్లు, ప్రయాణాలలో, చిన్న పిల్లలు స్కూల్ బ్రేక్ లలో స్నాక్స్ గా తినేవారు. అయితే కాలక్రమేణా శనగల ప్రాధాన్యత అర్థమవుతూ వస్తోంది. శనగలు శాకాహారులకు చాలా మంచి ప్రోటీన్ ఆహారం అనడంలో సందేహం లేదు. అయితే వేయించిన శనగల మీద పొట్టు తీసి తినడం కొందరికి అలవాటు. మరికొందరు పొట్టుతోనే తింటూ ఉంటారు. అసలు వేయించిన శనగలను ఎలా తింటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి? తెలుసుకుంటే..
Treadmill: ట్రెడ్ మిల్ పై రన్నింగ్ చేసేటప్పుడు ఈ మోడ్ ఆన్ చేసి చూడండి.. ఎంత ఈజీగా బరువు తగ్గుతారంటే..!
వేయించిన శనగలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే వాటిమీద పొట్టు తీయకుండా తింటే మరిన్ని అదనపు లాభాలు కూడా ఉంటాయి. వేయించిన శనగలను పొట్టు తో సహా తింటే జీర్ణక్రియ బలోపేతం అవుతుంది. ఈ పొట్టులో ఫైబర్ కంటెంట్ సమృద్దిగా ఉంటుంది.
వేయించిన శనగలను పొట్టుతో సహా తింటే జీవక్రియ రేటు పెరుగుతుంది. బరువు తగ్గాలని అనుకునే వారికి చాలా సహాయపడుతుంది. పొట్టుతో సహా వేయించిన శనగలు తింటే సాధారణం కంటే ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీల్ ఇస్తుంది. పైగా ఇందులో కేలరీలు కూడా తక్కువ.
చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఫైబర్ చాలా సహాయపడుతుంది. వేయించిన శనగల పొట్టులో ఉండే ఫైబర్ కూడా ఇదే విధంగా పనిచేస్తుంది. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడేవారు వేయించిన శనగలను పొట్టుతో సహా తినడం మంచిది.
Lemon Juice: నిమ్మరసం బాగా వాడుతుంటారా? చాలామందికి తెలియని నిజాలు ఇవీ..!
మధుమేహం ఉన్నవారు వేయించిన శనగలను పొట్టుతో సహా తినాలి. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడంలో సహాయపడుతుంది.
వేయించిన శనగలను పొట్టుతో సహా తింటూ ఉంటే ఎముకలు బలపడతాయి. ఐరన్, కాల్షియం, ఫాస్పేట్, మెగ్నీషియం, జింక్, మాంగనీస్ తో సహా ఇతర ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లు ఇందులో ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచుతాయి.
త్రివర్ణ పతాక రూపకర్త.. పింగళి వెంకయ్య గురించి ఈ నిజాలు తెలుసా..?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో మునగ ఆకుల నీరు తాగితే జరిగేది ఇదే..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.