Share News

Salt: మీరు వంటల్లో సరైన ఉప్పే వాడుతున్నారా? పోషకాహార నిపుణులు చెప్పిన షాకింగ్ నిజాలివీ..!

ABN , Publish Date - Jul 31 , 2024 | 11:15 AM

ఉప్పులో కూడా రకాలు ఉన్నాయి. అన్ని రకాల ఉప్పులు ఒకే విధంగా ఉండవు. ఇవి రూపంలోనే కాదు.. వాటిలో ఉన్న పోషకాలు, వాటి ద్వారా లభించే ప్రయోజనాలు కూడా వేర్వేరుగా ఉంటాయి.

Salt:  మీరు వంటల్లో సరైన ఉప్పే వాడుతున్నారా? పోషకాహార నిపుణులు చెప్పిన షాకింగ్ నిజాలివీ..!
salt

ఉప్పు లేని కూర.. సారం లేని జీవితం ఒకటేనని అని అంటుంటారు. ప్రతి వంటకానికి ఉప్పు ఉండటం తప్పనిసరి. అయితే ఉప్పులో కూడా రకాలు ఉన్నాయి. అన్ని రకాల ఉప్పులు ఒకే విధంగా ఉండవు. ఇవి రూపంలోనే కాదు.. వాటిలో ఉన్న పోషకాలు, వాటి ద్వారా లభించే ప్రయోజనాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. అసలు అందరూ వంటల్లో ఉపయోగిస్తున్న ఉప్పు సరైనదేనా? వంటకు ఏ ఉప్పు వాడటం మంచిది? పోషకాహార నిపుణులు ఉప్పు గురించి చెప్పిన షాకింగ్ విషయాలు తెలుసుకుంటే..

Diabetes: మధుమేహం ఉన్నవారికి అలర్ట్.. బ్రేక్ ఫాస్ట్ లో ఈ మిస్టేక్స్ చేస్తే డేంజరే..!



సెల్టిక్ ఉప్పు..

ఇది సాధారణ ఉప్పు కంటే తక్కువ సోడియం కలిగిన ఉప్పు. కోషెర్ ఉప్పు కంటే ఎక్కువ సోడియం కలిగి ఉంటుంది.

నల్ల ఉప్పు..

టేబుల్ సాల్ట్ కంటే తక్కువ సోడియం కంటెంట్ ఉంటుంది. ఇది అజీర్ణం, కడుపునొప్పి, వికారం, గుండెల్లో మంట వంటి సమస్యలలో సహాయపడుతుంది. నల్ల ఉప్పులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

కోషర్ ఉప్పు..

కోషర్ ఉప్పు పరిమాణంలో చాలా పెద్ద స్పటికాలతో ఉంటుంది. ఇది ముతకగా ఉంటుంది. దీన్ని తక్కువ శుద్ది చేసిన ఉప్పుగా పరిగణిస్తారు. ఇది తక్కువ ఉప్పు రుచిని కలిగి ఉంటుంది. అయితే ఇందులో అయోడిన్ ఉండదు. సాధారణ టేబుల్ సాల్ట్ కంటే తక్కువ సోడియం కంటెంట్ ఉంటుంది.

వైట్ రైస్ కు బదులు బ్రౌన్ రైస్ తింటే.. జరిగేదిదే..!


తక్కువ సోడియం ఉప్పు..

తక్కువ సోడియం ఉప్పులో సోడియం తక్కువ, పొటాషియం ఎక్కువ ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్నవారు, ఉప్పుకు సెన్సిటివ్ గా స్పందించేవారు దీన్ని తీసుకుంటే మేలు.

పింక్ సాల్ట్..

మినరల్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీన్ని వినియోగిస్తే కండరాల తిమ్మిరి తగ్గుతుంది. పింక్ సాల్ట్ ను క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తప్రసరణకు మెరుగ్గా సహాయపడుతుంది. కణాలలో PH స్థాయిని సమతుల్యం చేస్తుంది.

సాధారణ ఉప్పు..

ప్రతిరోజూ ఆహారంలో ఉపయోగించే తెల్ల ఉప్పు సాధారణ ఉప్పు. ఇందులో అయోడిన్ ఉంటుంది. ఇది చాలా సాధారణం అయినా దీని వినియోగాన్ని నియంత్రించాలని నిపుణులు చెబుతున్నారు. రోజులో 5 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు.

ఇవి తింటే చాలు.. వర్షాకాలంలో విటమిన్-డి లోపం మిమ్మల్సి టచ్ చేయదు..!


సముద్రపు ఉప్పు..

సముద్రపు ఉప్పులో ఖనిజాల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది సులభంగా కరగదు.

ఆహారంలో గులాబీ ఉప్పు లేదా సెల్టిక్ ఉప్పు తీసుకోవడం ఆరోగ్యకరమైనదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కుటుంబంలో ఎవరికైనా గుండె సంబంధ సమస్యలు, హైపర్ టెన్షన్ వంటివి ఉంటే వారు పింక్ సాల్ట్ ఉపయోగించడం మంచిది. కూరముక్కలను వేయించడానికి, ఫ్రై లలోనూ సోడియం తక్కువగా ఉన్న ఉప్పు వాడితే మేలని అంటున్నారు.

తక్కువ రక్తపోటు థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు సాధారణ ఉప్పును, సెల్టిక్ ఉప్పును రెండింటిని ఉపయోగిస్తూ ఉండటం మంచిదని చెబుతున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 31 , 2024 | 11:16 AM