Share News

Diabetic Patients: షుగర్ ఉన్నవారు చక్కెరకు బదులుగా బెల్లం తినొచ్చా..

ABN , Publish Date - Nov 16 , 2024 | 03:50 PM

మధుమేహం ఉన్నవారు బెల్లం తింటే ఏమవుద్దిలే అనుకుంటారు. మధుమేహం ఉన్నవారు చక్కెరకు బదులుగా బెల్లం కలిపిన స్వీట్లు, టీ, కాఫీలు వంటివి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం..

Diabetic Patients: షుగర్ ఉన్నవారు చక్కెరకు బదులుగా బెల్లం తినొచ్చా..
Jaggery

బెల్లంలో ఉండే కొన్ని సూక్ష్మ పోషకాల కారణంగా చక్కర కంటే బెల్లమే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుందంటారు. ఇందులో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటివి మెండుగా ఉంటాయి. అందుకని చాలామంది మధుమేహం ఉన్నవారు బెల్లం తింటే ఏమవుద్దిలే అనుకుంటారు. మధుమేహం ఉన్నవారు చక్కెరకు బదులుగా బెల్లం కలిపిన స్వీట్లు, టీ, కాఫీలు వంటివి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం..


సుక్రోజ్ అధికంగా ఉంటుంది

బెల్లంలోనూ సుక్రోజ్‌ ఉంటుంది. ఇది రక్తప్రవాహంలో గ్లూకోజ్‌గా విచ్ఛిన్నమయ్యే ఒక రకమైన చక్కెర. హైపర్ లైకేమియా సంబంధిత సమస్యలను తగ్గించుకునేందుకు మధుమేహ వ్యాధిగ్రస్తులు సుక్రోజ్ అధికంగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉంటారు కాబట్టి ఇది సరైన ఎంపిక కాదు.


రక్తంలో చక్కెర నియంత్రణ లేకపోవడం

బెల్లాన్ని చక్కెర కంటే తక్కువగా ప్రాసెస్ చేస్తారు. కానీ, రక్తంలో చక్కెరపై దాని ప్రభావం దాదాపు ఒకేలా ఉంటుంది. ఆహారంలో బెల్లం చేర్చడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నిర్వహించడంతో ఆటంకం కలుగుతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు అతిపెద్ద సవాలు.

సీక్రెట్ కేలరీలు..

బెల్లం అధిక క్యాలరీలు సైతం ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇది తరచుగా తీసుకుంటే బరువు పెరగడానికి కారణం అవుతుంది. అధిక బరువు లేదా ఊబకాయం మధుమేహాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. ఎందుకంటే అధిక బరువు ఇన్సులిన్ స్థాయిలతో ముడిపడి ఉంటుంది.


ప్రయోజనాలు నిల్..

బెల్లంలో ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలను కలిగి ఉన్నప్పటికీ, దీని వల్ల షుగర్ పేషంట్లకు చెప్పుకోదగ్గ ప్రయోజనాలేమీ లేవు. భోజనం తర్వాత రక్తంలో చక్కెర పెరగడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక అతి పెద్ద సమస్య. చిన్న మొత్తంలో బెల్లం తీసుకున్నా ఇదే ఫలితం ఉంటుంది.

కోరికలను పెంచుతుంది..

షుగర్ ఉన్నవారు ఆహారం విషయంలో సమతుల్యత పాటించడం అన్నింటికన్నా ముఖ్యం. కానీ, బెల్లంలో ఉండే తీపి గుణం కారణంగా ఎక్కువ ఆహారాన్ని తినాలనే కోరిక పెరుగుతుంది. ఇది అధిక బరువుకు దారి తీయవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN బాధ్యత వహించదు.)

Health: కదలరు.. నడవరు.. తగ్గిన శారీరక శ్రమతోనే ముప్పు


Updated Date - Nov 16 , 2024 | 03:51 PM