Share News

Sore Throat: ఈ 2 పదార్థాలు వాడితే చాలు.. వర్షాకాలంలో ఎదురయ్యే గొంతు నొప్పికి చెక్ పెట్టవచ్చు..!

ABN , Publish Date - Jul 25 , 2024 | 02:10 PM

గొంతు నొప్పి కారణంగా ఆహారం తినాలన్నా, ఏదైనా తాగాలన్నా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే కేవలం రెండు పదార్థాలు ఉపయోగించి గొంతునొప్పిని చాలా ఈజీగా తగ్గించవచ్చు.

Sore Throat: ఈ 2 పదార్థాలు వాడితే చాలు.. వర్షాకాలంలో ఎదురయ్యే గొంతు నొప్పికి చెక్ పెట్టవచ్చు..!
sore throat

వర్షాకాలం వస్తూ వస్తూ చాలా రకాల అనారోగ్య సమస్యలను వెంటబెట్టుకొస్తుంది. ఈ సీజన్ లో ఆహారం, నీరు బాగా కలుషితం అవుతాయి. వాతావరణంలో కూడా మార్పు ఉంటుంది. దీని వల్ల చాలామందికి గొంతునొప్పి వస్తుంది. గొంతు నొప్పి కారణంగా ఆహారం తినాలన్నా, ఏదైనా తాగాలన్నా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే కేవలం రెండు పదార్థాలు ఉపయోగించి గొంతునొప్పిని చాలా ఈజీగా తగ్గించవచ్చు. అవేంటో.. వాటిని ఎలా వాడాలో తెలుసుకుంటే..

అల్లం, తేనె..

వర్షాకాలంలో గొంతు నొప్పి తగ్గించడానికి అల్లాన్ని వేయించి పొడిగా చేయాలి. ఈ పొడిని తేనెతో కలిపి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ తీసుకుంటూ ఉంటే గొంతునొప్పి తగ్గిపోతుంది. ఇలా కుదరకపోతే అల్లాన్ని తురిమి లేదా దంచి రసం తీయాలి. ఈ రసంలో తేనె కలిపి తీసుకున్నా గొంతునొప్పి తగ్గుతుంది. కేవలం గొంతు నొప్పి మాత్రమే కాకుండా కింది ప్రయోజనాలు కూడా ఉంటాయి.

వైద్యులు చెప్పిన నిజాలు.. ఈ ఆల్కహాల్ రకాలు చాలా హెల్తీ..!


దగ్గు, కఫం..

అల్లం, తేనె మిశ్రమాన్ని తీసుకుంటే గొంతు నొప్పి, దగ్గు నయమవుతుంది. ఇది గొంతులో వాపును కూడా తగ్గిస్తుంది. వేయించిన అల్లాన్ని తేనెతో కలిపి తీసుకుంటే గొంతులో పేరుకున్న శ్లేష్మం వెంటనే బయటకు వస్తుంది. ఇది జలుబు, దగ్గు నుండి ఉపశమనం ఇస్తుంది.

ఎముకల ఆరోగ్యం..

వేయించిన అల్లం కీళ్లు, ఎముకల నొప్పులలో ఉపశమనాన్ని అందిస్తుంది. వేయించిన అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మధుమేహం..

వేయించిన అల్లం మధుమేహ రోగులకు చాలా మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంలో అల్లం చేర్చుకోవాలి.

బరువు తగ్గాలనుకునే వారికోసం భలే టిఫిన్లు.. వీటిలో కేలరీలు చాలా తక్కువ..!


మైగ్రేన్..

వేయించిన అల్లం తినడం వల్ల మైగ్రేన్ లేదా సాధారణ తలనొప్పిలో కూడా ఉపశమనం లభిస్తుంది. వేయించిన అల్లం తక్షణమే అందుబాటులో లేకుంటే అల్లం బదులుగా అల్లాన్ని నీటిలో ఉడికించి దీనికి తేనె కలుపుకుని తాగవచ్చు.

రోగనిరోధక శక్తి..

వేయించిన అల్లం, తేనె తీసుకుంటే వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని బలోపేతం అవుతుంది. ఇది అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. పిల్లలకు 1 టీస్పూన్ తేనెలో కొన్ని చుక్కల అల్లం రసం కలిపి ఇవ్వవచ్చు. ఇది పిల్లల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

మెచ్యురిటీ ఉన్న అబ్బాయిలలో ఈ లక్షణాలు ఉంటాయి..!

మార్కెట్లో దొరికే A1, A2 నెయ్యి మధ్య తేడాలేంటి?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 25 , 2024 | 02:10 PM