Share News

Star Anise: అనాసపువ్వు నీటిని ఎప్పుడైనా తాగారా? ఈ 7 నిజాలు తెలిస్తే అస్సలు వదలరు..!

ABN , Publish Date - May 06 , 2024 | 01:30 PM

అనాసపువ్వు వంటల్లో వాడే సాధారణ సుగంధ ద్రవ్యం. ముఖ్యంగా మసాలా వంటలు, బిర్యానీలలో స్టార్ అనీస్ ను వాడుతుంటారు. అయితే ఇలా కాకుండా అనాసపువ్వు నీటిని తీసుకుంటే ఆరోగ్య పరంగా బోలెడు ప్రయోజనాలున్నాయని అంటున్నారు నిపుణులు.

Star Anise: అనాసపువ్వు నీటిని ఎప్పుడైనా తాగారా? ఈ 7 నిజాలు తెలిస్తే అస్సలు వదలరు..!

స్టార్ అనీస్.. హిందీలో చక్ర ఫూల్ అని తెలుగులో అనాసపువ్వు అని అంటారు. ఇది వంటల్లో వాడే సాధారణ సుగంధ ద్రవ్యం. ముఖ్యంగా మసాలా వంటలు, బిర్యానీలలో స్టార్ అనీస్ ను వాడుతుంటారు. అయితే ఇలా కాకుండా అనాసపువ్వు నీటిని తీసుకుంటే ఆరోగ్య పరంగా బోలెడు ప్రయోజనాలున్నాయని అంటున్నారు నిపుణులు. అనాసపువ్వు నీటిలో వేసి మరిగించి ఆ తరువాత ఆ నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుంటే..

శరీరంలో మంటను తగ్గించే సమ్మేళనాలు అనాసపువ్వులో ఉంటాయి. దీర్ఘకాలిక మంట, ఆర్థరైటిస్, గుండె జబ్బులు తో సహా చాలా రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

ప్రపంచంలోనే అరుదైన 7 జంతువులు ఇవీ..!


బరువు తగ్గాలనే ప్రయత్నం చేసేవారికి అనాసపువ్వు నీరు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. శరీరం హైడ్రేటెడ్ గా ఉండటానికి, చక్కెర పానీయాలు తాగాలనే కోరికను తగ్గించుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది.

అనాసపువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవిరోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అంటువ్యాధులు, అనారోగ్యాల నుండి శరీరాన్ని రక్షిస్తాయి. అనాసపువ్వు నీటిని తరచుగా తీసుకుంటూ ఉండే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

గుండెపోటు రావడానికి ముందు కనిపించే లక్షణాలు ఇవే..!


శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి అనాసపువ్వు చక్కగా సహాయపడుతుంది. వృద్దాప్య సంకేతాలను తగ్గించి మెరిసే చర్మం సొంతమయ్యేలా చేస్తుంది.

అనాసపువ్వులో దగ్గు, ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి శ్వాసకోశ సమస్య లక్షణాలను తగ్గించే గుణాలు ఉంటాయి.

అనాసపువ్వు వాసన ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ప్రశాంతతను ప్రోత్సహిస్తుంది. ఇందులో సమ్మేశనాలు కండరాకు విశ్రాంతి చేకూరుస్తాయి. ఈ కారణంగా మహిళలకు నెలసరి సమయాలలో మంచిది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 06 , 2024 | 01:30 PM