Kidney: ఉదయం నిద్రలేవగానే ఇలా అనిపిస్తే.. మీకు ఈ రోగం వచ్చినట్లే..
ABN , Publish Date - Dec 09 , 2024 | 04:42 PM
కిడ్నీలు సరిగ్గా పని చేయకపోతే అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఉదయం నిద్రలేవగానే ఈ సమస్యలతో బాధపడుతున్నట్లైతే మీరు కిడ్నీ ఫెయిల్యూర్ బారినపడినట్లేనని అర్థం.
Kidney: మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ ఒకటి. అందులో చిన్నపాటి సమస్య కూడా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. మన శరీరంలోని వ్యర్థాలను కిడ్నీలు ఫిల్టర్ చేయడం వల్ల ఈ రోజుల్లో చాలా మందిలో కిడ్నీ సమస్య కనిపిస్తుంది. ఈ సమస్య ఎక్కువగా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల వస్తుంది. అంతేకాకుండా శారీరక శ్రమ లేకున్నా కూడా వస్తుంది. మన కిడ్నీలు సరిగ్గా పని చేయకపోతే, మనం ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ముందుగా ఈ కథనంలో కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క ప్రారంభ లక్షణాలను తెలుసుకుందాం..
ఉదయం చలిగా:
మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మీకు చలిగా అనిపిస్తే, అది మూత్రపిండాల వైఫల్యం యొక్క లక్షణం కావచ్చు . మీకు అలా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి కిడ్నీలను చెక్ చేయించుకోవడం మంచిది.
నురుగుతో కూడిన మూత్రం:
మూత్రపిండాలు దెబ్బతినడానికి మరొక లక్షణం నురుగు మూత్రం. మూత్రంలో నురుగు ఉంటే, మూత్రంతో పాటు ప్రోటీన్ కూడా శరీరం నుండి వెళ్లిపోతుందని అర్థం. మూత్రపిండాలు పోషకాలను సరిగ్గా ఫిల్టర్ చేయలేనప్పుడు ఇది సంభవిస్తుంది. ఈ సమస్య మీలో ఉన్నట్లైతే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
శరీరంలో వాపు:
చాలా సార్లు మన చేతులు, కాళ్లు లేదా శరీరంలోని ఏదైనా ఇతర భాగంలో వాపు ఉన్నట్లు అనిపిస్తుంది. అది కిడ్నీ దెబ్బతినడానికి సంకేతం కావచ్చు. మీకు శరీరంలోని ఏ భాగంలోనైనా వాపు అనిపిస్తే డాక్టర్ ను సంప్రదించడం మేలు.
ఉదయాన్నే దురద :
మీ శరీరం ఉదయాన్నే దురదగా అనిపిస్తున్నట్లైతే, ఇది కిడ్నీ స్టోన్ లేదా శరీరానికి సంబంధించిన ఏదైనా ఇతర వ్యాధికి సంకేతంగా ఉండవచ్చు. కాబట్టి దానిని నిర్లక్ష్యం చేయవద్దు. వైద్యులను సందప్రదించి సరైన చికిత్స తీసుకోండి.
(Note:పై సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఇవ్వబడింది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ABN దీనిని ధృవీకరించ లేదు. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించండి.)