Stomach Acids: గ్యాస్ట్రిక్ యాసిడ్ సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారా? ఈ 8 ఆహారాలతో సమస్యకు చెక్ పెట్టచ్చు!
ABN , Publish Date - Jan 16 , 2024 | 02:25 PM
కడుపులో ఏర్పడే యాసిడ్లు గ్యాస్ట్రిక్ సమస్యకు, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం మొదలైన సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్య తగ్గాలంటే ఈ ఆహారాలు తినాల్సిందే..
సాధారణంగా అందరూ తీసుకునే ఆహారాన్ని, ఆహారం జీర్ణం కావడాన్ని బట్టి కడుపులో యాసిడ్లు ఏర్పడతాయి. ఆహారం సరిగా జీర్ణం కాక పులిసిపోయి దాని ప్రభావం వల్ల కడుపులో యాసిడ్లు ఎక్కువ మొత్తంలో ఏర్పడతాయి. ఈ యాసిడ్లు గ్యాస్ట్రిక్ సమస్యకు, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం మొదలైన సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు ఆహారం తినాలన్నా, ఏదైనా తాగాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కడుపులో యాసిడ్ల సమస్యకు చెక్ పెట్టాలంటే ఈ కింది 8 ఆహారాలు తీసుకోవాలి.
అల్లం..
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి వాపు, ఆహారం జీర్ణం కావడంలో అసౌకర్యం, కడుపులో ఆమ్లాల ఉత్పత్తిని నియంత్రించడం వంటి సమస్యలలో సహాయపడుతాయి.
ఇది కూడా చదవండి: వాము గింజల నీటిని తాగితే.. కలిగే లాభాల లిస్ట్ ఇదీ..!
అరటిపండ్లు..
అరటిపండ్ల వల్ల జీర్ణాశయంలో తక్కువ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఇవి జీర్ణాశయంలో మృదువుగా చొచ్చుకుపోతాయి. జీర్ణాశయంలో ఉన్న అదనపు ఆమ్లాలలను తలస్థం చేయడంలో అరటిపండు చక్కగా పనిచేస్తుంది. తద్వారా గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గిస్తుంది.
ఓట్మీల్..
ఓట్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కడుపులో అదనపు ఆమ్లాలను గ్రహించడంలోనూ, గ్యాస్ట్పోసోఫాగియల్ రిప్లక్స్ వ్యాధిని తగ్గించడంలోనూ ఓట్మోల్ ఇవి బాగా పనిచేస్తాయి.
పుచ్చకాయ, సీతాఫలం..
పుచ్చకాయ, సీతాఫలం ఆల్కలీన్ స్వభావం కలిగి ఉంటాయి. అంటే శరీరం యాసిడ్లు ఉత్పత్తి చేయడాన్ని, ఆమ్లతను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.
ఇది కూడా చదవండి: ఖరీదైన ఫేస్ వాష్ లు కాదు.. పచ్చిపాలు ఇలా వాడితే ఎన్ని లాభాలంటే..!
ఆకుపచ్చ కూరగాయలు..
ఆల్కలీన్ కంటెంట్ ఆకుపచ్చ కూరగాయలలో తక్కువగా ఉంటుంది. పాలకూర, బచ్చలికూర, మెంతికూర, తోటకూర వంటి ఆకుకూరలు కడుపులో ఆమ్లాన్ని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
దోసకాయ..
దోసకాయలలో కడుపులో ఆమ్లాన్ని తటస్తం చేయడంలో సహాయపడుతుంది. కడుపులో యాసిడ్లకు కారణమయ్యే ప్రోటీన్ రిచ్ పోషకాలను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. దోసకాయలో నీటి కంటెంట్ ఆమ్లతను చల్లబరుస్తుంది.
కలబంద..
కలబంజలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి యాసిడ్లతో చికాకుగా మారిన అన్నవాహికకు ఉపశమనం కలిగిస్తాయి. కడుపులో ఆమ్లాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
తృణధాన్యాలు..
బ్రౌన్ రైస్, హోలో వీట్ బ్రెడ్ వంటి ఆహారాలు కాంప్లెక్స్ తో కూడిన కార్బోహైడ్రేట్లు. ఇవి కడుపులో ఆమ్లాన్ని ఉపశమనం చేయడంలో సహాయపడతాయి.
ఇది కూడా చదవండి: Leg Cramps: నిద్రపోతున్నప్పుడు కాళ్ళు తిమ్మిర్లు వస్తుంటాయా? అయితే మీకూ ఈ లోపమున్నట్టే లెక్క!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.