Gout: గౌట్ వ్యాధి ఎలా వస్తోంది.. నివారించడం ఎలా
ABN , Publish Date - Nov 03 , 2024 | 11:56 AM
గౌట్ వ్యాధి కేసులు పెరుగుతున్నాయి. దీంతో వ్యాధి రావడానికి గల కారణాలపై వైద్యులు విస్తుగొలిపే విషయాలు వెల్లడించారు. స్త్రీల కన్నా పురుషులకే వ్యాధి వ్యాప్తి ఎక్కువ అనే కఠోర వాస్తవాన్ని తెలియజేశారు.
డైట్, అల్కహాల్ తీసుకోవడం ద్వారా గౌట్ వ్యాధి వస్తుందనే భావనను యూనివర్శిటీ ఆఫ్ ఒటాగో పరిశోధకులు కొట్టిపడేశారు. గౌట్ వ్యాధి అనేది జన్యుపరంగా వస్తుందని అంటున్నారు. అసలు గౌట్ అంటే ఏంటి? ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? దీనిని ఎలా తగ్గించుకోవాలి? అనే విషయాలను మనం తెలుసుకుందాం.
గౌట్ లక్షణాలు:
గౌట్ వ్యాధి అనేది అత్యంత సాధారణ ఆర్థరైటిస్. ఇది స్త్రీల కంటే పురుషులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. శరీరంలో యూరిక్ ఆసిడ్ ఎక్కువగా ఉంటే గౌట్ వ్యాధి వస్తుంది. మనం తినే ఆహారంలో పూరీన్స్ అనే పదార్ధం వల్ల యూరిక్ ఆసిడ్ రక్తంలో చేరుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా పాదాలపై ప్రభావం చూపిస్తుంది. కాలి బొటన వేలి వద్ద వాపూ, పాదాల జాయింట్స్ వద్ద నొప్పిగా ఉండటం, ఉన్నట్టుండి పాదం, కాలి వేలు మండిపోతున్నట్లు అనిపించడం ఈ వ్యాధి లక్షణాలు. కొంతమందికి బ్లడ్‌లో యూరిక్ ఆసిడ్ ఎక్కువుగా ఉన్నప్పటికి ఎలాంటి లక్షణాలు త్వరగా బయటపడవు. మూడు నుంచి పది రోజుల త్వరతా బయటపడతాయి. ఇది దీర్ఘకాలిక వ్యాధిగా మారకుండా ఉండేందుకు ముందుగానే గ్రహించి చికిత్స తీసుకోవాలి. త్వరగా ట్రీట్‌మెంట్ తీసుకోకపోతే జాయింట్స్ పర్మినెంట్ గా డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది.
వారసత్వంగా..
చాలా మంది ఈ గౌట్ వ్యాధి మనం తీసుకునే ఆహారం, మద్యపానం ఎక్కువగా తీసుకోవడం వల్లే వస్తుందని అపోహ పడుతుంటారు. ఈ అపోహను న్యూజిలాండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ ఒటాగో పరిశోధకులు కొట్టిపడేస్తున్నారు. గౌట్ అనేది జన్యుపరంగా వచ్చే దీర్ఘకాలిక వ్యాధి అని అన్నారు. కేవలం వారసత్వంగా వస్తుంది అని కూడా అనలేమన్నారు. కిడ్నీ ప్రాబ్లం, థైరాయిడ్, హైబీపీ, డయాడిటీస్ లాంటి సమస్యలు ఉన్నా ఈ వ్యాధి వస్తుంది.
ఇవి తీసుకోవద్దు
రెడ్ మీట్, ఆర్గన్ మీట్ లాంటి ప్యూరీన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నా, ఆల్కహాల్ అలవాటు ఎక్కువగా ఉన్నా, డైయురెటిక్స్ లాంటి మెడిసిన్స్ ఎక్కువగా తీసుకున్నా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల సీ ఫుడ్స్, షుగర్ ఎక్కువన్న ఫుడ్స్ లాంటివి తినడం మానేస్తే మంచిదని సూచించారు. ఈ వ్యాధి ఉన్న వారు ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయాలు తీసుకోవడం మంచిదని, బరువు ఉన్న వాళ్లు తగ్గాలని సూచిస్తున్నారు. ఆల్కహాల్ తగ్గించడం, పూరీన్ రిచ్ ఫుడ్ తగ్గించడం, స్మోకింగ్ అలవాటు మానేయడం, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం, సరిపడా నీరు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Health Tips: దీపావళి తరువాత చాలా మంది ఎదుర్కునే సమస్యలు.. వాటికి పరిష్కారాలు ఇవిగో..
Skin Care: ముఖ చర్మం మెరిసిపోవాలంటే.. ఇంట్లోనే ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగండి..!
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.