Jaggery: అధిక కొలెస్టెరాల్ ఉన్న వాళ్లు బెల్లం తినొచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..
ABN , Publish Date - May 28 , 2024 | 04:07 PM
అధిక కొలెస్టెరాల్ ఉన్న వాళ్లు చక్కెరకు బదులు బెల్లం తినాలని నిపుణులు చెబుతున్నారు. బెల్లంలోని పోషకాలు కొలెస్టెరాల్ స్థాయిల నియంత్రణకు ఉపకరిస్తాయని అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: స్వీట్లు అంటే ఇష్టముండని వారు చాలా అరుదు. షుగర్ ఉన్న వాళ్లు స్వీ్ట్లు తినకూడదన్న విషయం తెలిసిందే. అయితే, అధిక కొలెస్టెరాల్ (High Cholesterol) ఉన్న వారు కూడా చక్కెర విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇక అధిక కొలెస్టెరాల్ ఉన్న వారికి చక్కెర (Sugar) మంచిదా బెల్లం (Jaggery) మంచిదా (Health) అన్న సందేహం కొందరికి కలుగుతుతుంది. ఈ అంశంపై వైద్యులు సవివరమైన సమాధానం ఇచ్చారు.
ఆహారం రుచికరంగా మారేందుకు చక్కెర, బెల్లం రెండూ ఉపకరిస్తాయి. రెండిటి ముడి సరకు ఒకటే అయినా తయారీ విధానంలో కొన్ని మౌలిక తేడాలు ఉన్నాయి. చెరకు రసాన్ని బాగా రిఫైన్, ప్రాసెస్ చేసి చక్కెర తయారు చేస్తారు. దీనికంటే భిన్నమైన ప్రక్రియతో చెరకు నుంచి బెల్లం తయారు చేస్తారు. కాబట్టి చక్కెర కంటే బెల్లం సహజసిద్ధమైనదని నిపుణులు చెబుతున్నారు.
Health: మెదడుకు చేటు చేసే ఫుడ్స్.. వీటి జోలికెళ్లొద్దు!
చక్కెరను ఏ రూపంలో అధికంగా తిన్నా ఆరోగ్యానికి హానికరమేనని నిపుణులు చెబుతున్నారు. అనేక రకాల వ్యాధుల బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. కానీ, పరిమితికి లోబడి బెల్లం తింటే అనేక రకాల ప్రయోజనాలు చేకూరుతాయి (sugar or jaggery which is beneficial for high cholesterol patients ).
నిపుణుల ప్రకారం, చక్కెర శరీరంలో కొలెస్టెరాల్ స్థాయిలను పెంచుతుంది. అధిక చక్కెర తీసుకుంటే మధుమేహం కూడా అదుపుతప్పుతుంది. ఇది హానికారకమైన ట్రైగిసరైడ్స్ స్థాయిలను కూడా పెంచుతుంది. కాబట్టి అధిక కొలెస్టెరాల్ ఉన్న వారు చక్కెరకు బదులు బెల్లం తింటే అనేక ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకున్నట్టు అవుతుంది. జ్యూస్‌లకు బదులు పండ్లు అధికంగా తింటే కొలెస్టెరాల్ సమస్య నుంచి కొంత వరకూ బయటపడొచ్చు.
బెల్లంలో ఉండే పోషకాలు శరీరంలో కొలెస్టెరాల్ స్థాయిలు పెరగకుండా చూస్తాయి. అంతేకాదు, శరీరంలో విషతుల్యాలు తొలగించడంలో సహకరిస్తాయి. బెల్లంతో జీర్ణ వ్యవస్థ కూడా మెరుగవుతుంది. కాబ్టటి, అధిక కొలెస్టెరాల్ సమస్యతో బాధపడేవాళ్లు చక్కెరకు బదులు బెల్లం తింటే అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణుల స్పష్టంగా చెబుతున్నారు.