Health Tips: స్వీట్ డ్రింక్స్ ఎక్కువగా తాగేస్తున్నారా? భయంకరమైన నిజాలు మీకోసం..!
ABN , Publish Date - Mar 05 , 2024 | 04:04 PM
Health Tips: ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్యులు, ఆరోగ్య నిపుణులు(Health Experts) సూచిస్తుంటారు. రోజూ కనీసం 10 వేల అడుగులు నడిస్తే(Walking) ఆరోగ్యం బాగుంటుందని.. వ్యాధుల బారిన పడకుండా ఉంటారని చెబుతారు. అయితే, ఒక్కోసారి రోజూ వ్యాయామం చేసినా.. మనం తినే, తాగే కొన్ని పదార్థాల వల్ల అనారోగ్యం బారిన పడుతుంటారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు ఊబకాయం, హృదయ సంబంధిత వ్యాధులతో(Heart Disease) బాధపడుతున్నారు.
Health Tips: ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్యులు, ఆరోగ్య నిపుణులు(Health Experts) సూచిస్తుంటారు. రోజూ కనీసం 10 వేల అడుగులు నడిస్తే(Walking) ఆరోగ్యం బాగుంటుందని.. వ్యాధుల బారిన పడకుండా ఉంటారని చెబుతారు. అయితే, ఒక్కోసారి రోజూ వ్యాయామం చేసినా.. మనం తినే, తాగే కొన్ని పదార్థాల వల్ల అనారోగ్యం బారిన పడుతుంటారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు ఊబకాయం, హృదయ సంబంధిత వ్యాధులతో(Heart Disease) బాధపడుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు చాలా మంది రోజూ వ్యాయామం చేస్తుంటారు. కానీ, కొందరు వ్యాయామం చేస్తున్నప్పటికీ.. చక్కెర పదార్థాలతో తయారు చేసే డ్రింక్స్, సోడాలు, జ్యూస్‌లు బాగా తాగుతుంటారు. అలాంటి వారు రోజూ వ్యాయామం చేసినా ఉపయోగం లేదని, వీరికి త్వరగా గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తాజాగా కెనడియన్ బృందం జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. దాదాపు లక్ష మందిపై జరిపిన పరిశోధనలో కీలక అంశాలు వెల్లడించారు. శారీరక శ్రమ ఉన్నప్పటికీ.. స్వీట్ డ్రింక్స్ చాలా ప్రమాదకరం అని పేర్కొన్నారు. వారానికి రెండుసార్లు కంటే ఎక్కువ ఈ డ్రింక్స్ తాగే వారికి హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిర్ధారించారు.
ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం.. 150 నిమిషాల పాటు శారీరక శ్రమ చేసినా కూడా స్వీట్ డ్రింక్స్ తాగడం వల్ల వచ్చే ప్రభావాలను అడ్డుకోలేవని స్పష్టం చేశారు. లావాల్ యూనివర్సిటీ ఫార్మసీ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ జీన్-ఫిలిప్ డ్రౌయిన్-చార్టియర్.. ‘వ్యాయామం చేయడం వల్ల.. స్వీటెనర్ డ్రింక్స్‌తో సంబంధం ఉన్న హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని సగానికి తగ్గిస్తుంది. కానీ అది పూర్తిగా తగ్గించదు.’ అని పేర్కొన్నారు.
వాస్తవానికి మనం అనేక వాణిజ్య ప్రకటనల్లో చూస్తుంటాం.. స్వీట్ డ్రింక్స్ తాగడం వల్ల ఎనర్జీ వస్తుందని, ఫిట్‌గా ఉంటారని సదరు యాడ్స్‌లో చెబుతుంటారు. కానీ, నిజానికి అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఈ డ్రింక్స్ హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ డ్రింక్స్ రోజూ తాగితే అనారోగ్య సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ స్వీట్ డ్రింక్స్ తీసుకోవడం కంటే.. సహజ పండ్ల రసాలు, నీరు మేలు చేస్తుందని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే, రోజూ తగినంత శారీరక శ్రమ ఉండాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..