Water: నీళ్లలో ఇది కలుపుకుని తాగితే 5 రోగాలు వెంటనే మాయం..
ABN , Publish Date - Dec 10 , 2024 | 10:49 AM
పసుపును ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా, రోజూ వంటల్లోనూ వాడతారు. అయితే, నీళ్లలో పసుపు కలుపుకుని తాగితే ఈ 5 రోగాలు వెంటనే మాయం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
Turmuric Water: నీళ్లు తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే శరీరంలో ఉన్న టాక్సిన్స్, మలిన పదార్థాలు అన్ని బయటకుపోతాయి. అంతేకాకుండా మలబద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తవని నిపుణులు చెబుతారు. అయితే, నీళ్లతో పాటు ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తున్న పసుపును కలుపుకుని తాగితే శరీరం మరింత ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.
ఉపశమనం..
నీళ్లలో పసుపు కలుపుకుని తాగడం వల్ల బ్లడ్ షుగర్ సమస్య నయమవుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రించవచ్చు. మధుమేహం ఉన్నవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీటిలో పసుపు కలుపుకుని తాగాలి. జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు కూడా పసుపును ఉపయోగించవచ్చు. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో పసుపు కలిపిన నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. నీళ్లలో పసుపు కలుపుకుని తాగడం వల్ల పేగు, పొట్ట సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
శరీరాన్ని రక్షిస్తాయి..
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో పసుపును నీటిలో కలిపి తాగితే, చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే, అది గుండె జబ్బుల సమస్యకు దారి తీస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే పసుపును నీళ్లలో కలుపుకుని తాగాలి. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని నుండి శరీరాన్ని రక్షిస్తాయి. పసుపును నీటిలో కలుపుకుని క్రమం తప్పకుండా తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో మంట తగ్గుతుంది.
(Note:పై సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఇవ్వబడింది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ABN దీనిని ధృవీకరించ లేదు. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించండి.)