Share News

Vitamin-C: విటమిన్-సి శరీరానికి ఎందుకు అవసరం? వైద్యులు చెప్పిన అసలు నిజాలేంటంటే..!

ABN , Publish Date - Jun 26 , 2024 | 11:31 AM

విటమిన్-సి శరీరానికి చాలా కీలకమని, రోజువారీ ఆహారంలో దీన్ని తప్పనిసరిగా తీసుకోవాలని ఆహార నిపుణులు చెబుతారు. అసలు విటమిన్-సి శరీరానికి చేసే మేలు ఏంటి? ఇది ఎన్ని విధాలుగా సహాయపడుతుంది? శరీరానికి ఎంత అవసరం?

Vitamin-C: విటమిన్-సి శరీరానికి ఎందుకు అవసరం? వైద్యులు చెప్పిన అసలు నిజాలేంటంటే..!

శరీరానికి అవసరమైన విటమిన్లలో విటమిన్-సి చాలా కీలకమైనది. ఆమ్ల ఫలాలలో, కొన్ని రకాల కూరగాయలలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది గొప్ప యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. అయితే విటమిన్-సి శరీరానికి చాలా కీలకమని, రోజువారీ ఆహారంలో దీన్ని తప్పనిసరిగా తీసుకోవాలని ఆహార నిపుణులు చెబుతారు. అసలు విటమిన్-సి శరీరానికి చేసే మేలు ఏంటి? ఇది ఎన్ని విధాలుగా సహాయపడుతుంది? శరీరానికి ఎంత అవసరం? తెలుసుకుంటే..

విటమిన్-డి శరీరంలో ఎక్కువ ఉంటే ఏం జరుగుతుందంటే..!


విటమిన్ సి నీటిలో కరుగుతుంది. శరీరం దీన్ని నిల్వ చేయదు. శరీరానికి విటమిన్-సి పుష్కలంగా అందాలంటే రోజూ విటమిన్-సి ఆధారిత ఆహారాలు తప్పకుండా తీసుకోవాలి. విటమిన్ సి శరీరంలో కొల్లాజెన్, ఎల్-కార్నిటైన్, కొన్ని న్యూరోట్రాన్స్మిటర్లను ఉత్పత్తి చేస్తుంది. యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. ఇది శరీరం నుండి రియాక్టివ్ ఆక్సిడేటివ్ అని పిలువబడే అవాంఛిత పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. శరీరం ఐరన్ గ్రహించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గాయాలు నయం చేయడంలో సహాయపడుతుంది.

19 నుండి 64 సంవత్సరాల వయసు గల వారికి ప్రతిరోజు 40మి.గ్రా విటమిన్-సి అవసరం అవుతుంది. నారింజ, ఆమ్ల ఫలాలు, క్యాప్సికమ్, స్ట్రాబెర్రీలు, బ్రోకలీ, బ్రస్సెల్స్ మొలకలు.. మొదలైనవాటిలో విటమిన్-సి పుష్కంలగా ఉంటుంది.

విటమిన్-డి శరీరంలో ఎక్కువ ఉంటే ఏం జరుగుతుందంటే..!

మహిళలలో కండరాలను బలంగా ఉంచే సూపర్ ఫుడ్స్..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 26 , 2024 | 11:31 AM