Share News

Walking Mistakes: వాకింగ్ చేసే చాలామందికి తెలియని షాకింగ్ నిజాలివీ..!

ABN , Publish Date - Apr 22 , 2024 | 01:09 PM

వాకింగ్ ది ఏముంది సింపుల్.. అలా నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు అనుకునేవాళ్లు చాలామంది ఉంటారు. అయితే వాకింగ్ విషయంలో కూడా చాలామంది తప్పులు చేస్తారు. వాకింగ్ చేసేటప్పుడు తెలియకుండా చేసే ఈ తప్పుల వల్ల నష్టాలు కూడా ఉంటాయి.

Walking Mistakes: వాకింగ్ చేసే చాలామందికి  తెలియని షాకింగ్ నిజాలివీ..!

వాకింగ్ అనేది జీవనశైలిలో ఒక మంచి అలవాటు. చాలామంది వేరే ఇతర ఎక్సర్సైజులు చేయకపోయినా, యోగా, జిమ్ వంటివి చేయకపోయినా వాకింగ్ మాత్రం చేస్తుంటారు. వాకింగ్ చేయడానికి ఖరీదైన వస్తువులేమీ అవసరం లేదు. ఈ కారణంగానే చాలామంది ఫిట్ నెస్ కోసం వాకింగ్ ను ఎంచుకుంటారు. వాకింగ్ ది ఏముంది సింపుల్.. అలా నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు అనుకునేవాళ్లు చాలామంది ఉంటారు. అయితే వాకింగ్ విషయంలో కూడా చాలామంది తప్పులు చేస్తారు. వాకింగ్ చేసేటప్పుడు తెలియకుండా చేసే ఈ తప్పుల వల్ల నష్టాలు కూడా ఉంటాయి. ఇంతకూ వాకింగ్ చేసేటప్పుడు చేయకూడని తప్పులేంటో తెలుసుకుంటే..

షూస్ ఎంపిక..

వాకింగ్ చేసేవారు ఎలా చేసినా ఏం కాదులే అనుకోకూడదు. వాకింగ్ కోసం ప్రత్యేకంగా షూస్ ఎంచుకోవాలి. మరీ ముఖ్యంగా ఎక్కువ దూరం వాకింగ్ చేసేవారు అయితే షూస్ తప్పకుండా వాడాలి. పాదాలకు బాగా మెత్తగా, వంపు తిరిగనట్టు ఫ్లెక్సిబుల్ గా ఉండే అరికాళ్లతో ఉన్న షూస్ ఎంచుకోవాలి. ఈ షూస్ మరీ ఎక్కువ బరువు ఉండకూడదు.

మీకు నిద్రలో నరాలు లాగేస్తుంటాయా? అయితే ఈ సమస్యలున్నట్టే లెక్క ..!


వాకింగ్ స్టైల్..

వాకింగ్ చేసేటప్పుడు వాకింగ్ స్టైల్ కూడా ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. వాకింగ్ చేస్తున్నప్పుడు కిందకు వంగడం లేదా పాదాల వైపు చూస్తూ నడవడం వంటివి చేయకూడదు. స్ట్రైట్ గా, వెన్నును నిటారుగా ఉంచి, ఛాతీని కాస్త ముందుకు వంచి, వాకింగ్ చేస్తున్న మార్గం వేపు చూస్తూ నడవాలి.

ఓవర్ స్ట్రైడింగ్..

వాకింగ్ చేసేటప్పుడు కొందరు మెల్లిగా నడిస్తే మరికొందరు వేగంగా నడుస్తారు. అయితే మరికొందరు చిన్న అడుగులతో వాకింగ్ చేస్తే ఇంకొందరు పెద్ద పెద్ద అంగలు వేస్తూ వాకింగ్ చేస్తారు. కానీ ఇలా పెద్ద అంగలు వేస్తూ వాకింగ్ చేసేటప్పుడు ఏవర్ స్ట్రైడింగ్ జరుగుతుంది. ఓవర్ స్ట్రైడింగ్ వల్ల సాధారణంగా జరిగే నడక మెకానిజం కు అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా కీళ్లపై ప్రభావం పడుతుంది. కాలక్రమేణా ఇది అసౌకర్యాన్ని లేదా మోకాలి గాయాన్ని కలిగిస్తుంది.

ఈ టిప్స్ పాటిస్తే చాలు.. ముఖం శాశ్వతంగా మెరుస్తూ ఉంటుంది..!


వార్మ్ అప్.. కూల్ డౌన్..

వాకింగ్ కూడా ఒక వ్యాయామమని దానికి వార్మప్, కూల్డౌన్ ముఖ్యమని తెలిసిన వారు చాలా తక్కువ. అందుకే వాకింగ్ చేసేవారు దీన్ని ఫాలో అవ్వకుండా నేరుగా వాకింగ్ చేస్తుంటారు. వార్మప్, కూల్డౌన్ కాకుండా చేసే వాకింగ్ వల్ల గాయాలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఈ టిప్స్ పాటిస్తే చాలు.. ముఖం శాశ్వతంగా మెరుస్తూ ఉంటుంది..!

మీకు నిద్రలో నరాలు లాగేస్తుంటాయా? అయితే ఈ సమస్యలున్నట్టే లెక్క ..!

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 22 , 2024 | 01:10 PM