Share News

Walnuts Vs Almonds: వాల్నట్స్ లేక బాదం గింజలు.. రెండింటిలో ఆరోగ్యానికి ఏవి ఎక్కువ మేలు చేస్తాయంటే..!

ABN , Publish Date - Aug 11 , 2024 | 09:37 AM

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఫాలో అయ్యేవారు రోజులో ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటారు. వీటిలో ముఖ్యంగా వాల్నట్స్ కు, బాదం గింజలకు చాలా ఆదరణ ఉంది.

Walnuts Vs Almonds: వాల్నట్స్ లేక బాదం గింజలు..  రెండింటిలో  ఆరోగ్యానికి ఏవి ఎక్కువ మేలు చేస్తాయంటే..!
Walnuts Vs Almonds

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఫాలో అయ్యేవారు రోజులో ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటారు. వీటిలో ముఖ్యంగా వాల్నట్స్ కు, బాదం గింజలకు చాలా ఆదరణ ఉంది. రాత్రి సమయంలో నానబెట్టిన వాల్నట్స్ లేదా బాదం గింజలు తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని ఆహార నిపుణులు కూడా చెబుతారు. అయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఆరోగ్యానికి ఏది ఎక్కువ లాభాలు చేకూరుస్తుంది? తెలుసుకుంటే..

అరచేతులను రుద్దితే శరీరంలో కలిగే మార్పులేంటో తెలుసా..?


పోషకాలు..

  • వాల్నట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో అల్పా-లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది వాపును తగ్గించడం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో పనిచేస్తుంది.

  • బాదంలో మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. ఈ కొవ్వులు అసంతృప్త కొవ్వులు, ఇవి శరీరంలో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ పెంచి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి.

విటమిన్లు, ఖనిజాలు..

  • వాల్నట్స్ లో మాంగనీస్, కాపర్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్-బి6 కూడా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యానికి, మెదడు చురుగ్గా పనిచేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

  • బాదంలో విటమిన్-ఇ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఆక్సీకరణ నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

యవ్వనంగా ఉండటానికి ఆయుర్వేదం చెప్పిన రహస్య చిట్కాలు..!


కేలరీలు..

  • వాల్నట్స్ లో బాదం పప్పు కంటే ఎక్కువ కొవ్వు ఉంటుంది. అయితే ఇవన్నీ ఆరోగ్యకరమైన కొవ్వులు. 30గ్రాముల వాల్నట్స్ లో 2.5 గ్రాముల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తో సహా 18 గ్రాముల కొవ్వు ఉంటుంది.

  • బాదం పప్పులో 30 గ్రాముల బాదం పప్పులో 14గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇందులో ఎక్కువగా మోనోశాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. కనీసం రోజుకు రెండు గింజలు తిన్నా మంచి ఫలితాలు ఉంటాయి.

ప్రయోజనాలు..

  • వాల్నట్స్ లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ లు శోథ నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి. కీళ్లనొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో పాలీఫెనోలిక్ సమ్మేళనాలు అధికంగా ఉండటం వల్ల మెదడు ఆరోగ్యానికి కూడా సహకరిస్తాయి. న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

  • బాదంలో విటమిన్-ఇ కంటెంట్ ఎక్కువ. ఆరోగ్యకరమైన జుట్టు, చర్మానికి ఇది చాలా అవసరం. బరువు నిర్వహణలో కూడా బాదం సహాయపడుతుంది. బరువు తగ్గడానికి బాదం తింటే మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో బాదం ప్రభావవంతంగా ఉంటుంది. కాబట్టి వాల్నట్స్, బాదం తో వేటి ప్రయోజనాలు వాటికి వేర్వేరుగా ఉన్నాయి. అవసరాన్ని బట్టి అవి తీసుకోవచ్చు.

రోజూ ఒక లవంగాన్ని నమిలి తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..!

ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ఎంత డబ్బు ఆదా చేయవచ్చో తెలుసా?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 11 , 2024 | 09:37 AM