Share News

Weight Loss: బరువు తగ్గాలంటే నీరు ఎలా తాగాలి? వైద్యులు చెప్పిన నిజాలివీ..!

ABN , Publish Date - Oct 14 , 2024 | 03:00 PM

మంచినీరు తాగుతూ బరువు తగ్గవచ్చని అంటుంటారు. అయితే ఇలా తాగితే మంచి ఫలితాలు ఉంటాయట.

Weight Loss: బరువు తగ్గాలంటే నీరు ఎలా తాగాలి? వైద్యులు చెప్పిన నిజాలివీ..!

బరువు తగ్గడం ఇప్పట్లో చాలామందికి పెద్ద టాస్క్. ఇందుకోసం వ్యాయామం నుండి యోగ, డైట్, జిమ్.. ఇలా చాలా ఫాలో అయ్యే వారు ఉన్నారు. అయితే బరువు తగ్గడానికి మంచి నీరు బాగా సహాయపడుతుందని వైద్యులు, ఆహార నిపుణులు చెబుతున్నారు. కానీ మంచినీరు ఎలాగంటే అలా తాగకూడదు. మంచి నీటిని వైద్యులు చెప్పినట్టు ఒక క్రమ పద్దతిలో తాగితే బరువు తగ్గడం పెద్ద కష్టమేమి కాదని అంటున్నారు. ఇంతకీ మంచి నీరు ఎప్పుడు.. ఎలా తాగాలంటే..

ఆఫీసులో నిద్ర వస్తుందా.. ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి..!


  • ఉదయాన్నే మేల్కున్న తరువాత ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నీరు తాగాలట. ఇలా చేయడం వల్ల శరీరంలో టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. రోజంతా శరీరం చురుగ్గా ఉండగలుగుతుంది. మరీ ముఖ్యంగా ఉదయాన్నే సాధారణ నీటికి బదులుగా గోరు వెచ్చని నీరు తాగితే ఇంకా మంచిది.

  • భోజనం చేయడానికి అరగటం ముందు ఒక గ్లాసు నీరు తాగాలట. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఎక్కువ ఆహారం తినకుండా ఎక్కువ కేలరీలు శరీరంలోకి వెళ్లకుండా చేయడంలో సహాయపడుతుంది.

  • చాలామంది భోజనం చేసేటప్పుడు నీరు చాలా ఎక్కువగా తాగుతుంటారు. ఇది ఆహారం వేగంగా తినడానికి సహాయపడుతుంది కానీ జీర్ణాశయంలో జీర్ణ రసాలు పలుచన అయ్యేలా చేస్తుంది. దీని కారణంగా ఆహారం తొందరగా జీర్ణం కాదు.. జీర్ణాశయంలో, పేగులలో ఎక్కువసేపు ఉండిపోయి అది కాస్తా పులిసిపోయి ఎసిడిటీ, గ్యాస్, పుల్ల త్రేన్పులు వంటి సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి ఆహారం తినేటప్పుడు నీరు ఎక్కవ తాగకూడదు. ఆహారం బాగా నమిలి తినాలి. కారం, పులుపు, ఉప్పు కారణంగా నీరు తాగాలని అనిపిస్తే కొద్దిగా సిప్ చెయ్యాలి అంతే.

కొలెస్ట్రాల్ పెరిగితే శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే..!


  • నిద్ర వేళకు ఒక గంట ముందు నీరు త్రాగడం వల్ల రాత్రిపూట శరీరం డీహైడ్రేషన్ కు లోను కాకుండా ఆపవచ్చు. నిద్రకు గంట ముందు తాగడం వల్ల జీవక్రియ కూడా బాగుంటుంది.

  • ఉదయం, మధ్యాహ్నం, రాత్రి.. ఆహారం తీసుకోవడానికి మద్య సమయాలలో నీటిని తాగుతూ ఉంటే మంచిది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. శీతల పానీయాలు, చిరుతిండ్లు తీసుకోవడానికి బదులు మంచి నీరు తాగుతుంటే శరీరం కూడా హైడ్రేట్ గా ఉంటుంది.

  • శారీరక వ్యాయామం చేయడానికి ముందు నీరు తాగితే శరీరంలో ద్రవాలు సమతుల్యంగా ఉండటానికి శరీర పనితీరు మెరుగ్గా ఉండటానికి సహాయపడుతుంది. కండరాల పునరుద్దరణకు మద్దతు ఇస్తుంది. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బరువు తగ్గడంలో తోడ్పడుతుంది.

ఇవి కూడా చదవండి..

ఆడవాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవి..!

బాదం తొక్కలు పడేస్తుంటారా? ఇవి ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో తెలుసా?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 14 , 2024 | 03:00 PM