Weight Loss:: వెయిట్ లాస్ డ్రింకులు అక్కర్లేదు.. బరువు తగ్గడానికి ఈ పండు తినండి చాలు!!
ABN , Publish Date - Jan 16 , 2024 | 09:54 AM
వెయిట్ లాస్ డ్రింకులు అవసరమే లేదు.. అందరికీ అందుబాటులో ఉండే ఈ పండు తింటే మ్యాజిక్ ఫలితాలు ఉంటాయి.
అధికబరువు మీద చాలామందికి అవగాహన ఏర్పడుతోంది. బరువు కారణంగా చెడు కొలెస్ట్రాల్, గుండె సంబంధ సమస్యలు, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు వస్తాయి. అధిక బరువు అన్ని రోగాలకు మూలకారణం. అందుకే బరువు తగ్గించుకోవడానికి చాలామంది ఆహారం, వ్యాయామం గురించి జాగ్రత్త తీసుకుంటున్నారు. కొందరు వెయిట్ లాస్ కోసం మార్కెట్లో లభ్యమయ్యే వెయిట్ లాస్ డ్రింకులు కూడా వాడుతుంటారు. కానీ వెయిట్ లాస్ డ్రింకులు అవసరమే లేదు.. అందరికీ అందుబాటులో ఉండే బొప్పాయి పండు తినడం వల్ల బరువు ఈజీగా తగ్గవచ్చట. ఇంతకీ బొప్పాయి బరువు తగ్గడంలో ఎలా సహాయం చేస్తుందో తెలుసుకుంటే..
బొప్పాయిలో ఫైబర్ ఎక్కువ, కేలరీలు తక్కువ. ఈ కారణంగా ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. సులభంగా జీర్ణమవుతుంది. జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. కడుపు ఉబ్బరం సమస్యను పరిష్కరిస్తుంది.
ఇది కూడా చదవండి: తల్లిదండ్రులను చూసి పిల్లలు తొందరగా నేర్చుకునే అలవాట్లు ఇవే..!
బొప్పాయి కేలరీలు..
బొప్పాయిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బిస్కెట్లు, చిప్స్, బేకరీ ఫుడ్స్, మిల్క్ షేక్స్ కంటే కూడా బొప్పాయి పండును స్నాక్ గా తింటే అద్బుత ఫలితాలుంటాయి. వంద గ్రాముల బొప్పాయిలో 59కేలరీలు ఉంటాయి. అలాగే 15గ్రాముల కార్బోహైడ్రేట్స్, 3గ్రాముల ఫైబర్, విటమిన్-సి, ఫోలేట్, పొటాషియం, విటమిన్-ఎ ఉంటాయి.
ఫైబర్..
బొప్పాయిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ. ఇది బరువు నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆహారం తినాలనే కోరికను తగ్గిస్తుంది. ఉబ్బరం సమస్యను తగ్గిస్తుంది.
ఇది కూడా చదవండి: అశ్వగంధ పొడిని పాలల్లో కలిపి తాగితే ఇన్ని లాభాలుంటాయని తెలుసా?
విటమిన్-సి..
విటమిన్-సి పుష్కలంగా ఉండటం వల్ల బొప్పాయి నారింజ కంటే మెరుగైన ప్రయోజనాలు ఇస్తుంది. జీవక్రియను పెంచుతుంది.
పొటాషయం..
బొప్పాయిలో పొటాషియం అధిక మొత్తంలో ఉంటుంది. ఇది సోడియం స్థాయిలు సమతుల్యంగా ఉంచతుతుంది. తద్వారా రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. ద్రవాలను సమతుల్యం చేస్తుంది.
బీటా కెరోటిన్..
బీటా కెరీటిన్ ఉండటం వల్ల బొప్పాయి తింటే బరువు నియంత్రణ సాధ్యమవుతుంది. రోగనిరోధక శక్తిని బలంగా చేస్తుంది.
ఇది కూడా చదవండి: Drinking Water: నిలబడి నీళ్ళు తాగితే ఏమవుతుంది? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.