Winter Effect: ఎక్కువ సేపు చలిలో ఉంటే ఏం జరుగుతుంది? వైద్యులు చెబుతున్న షాకింగ్ నిజాలివీ..!
ABN , Publish Date - Jan 07 , 2024 | 03:56 PM
భయపడి పనులు ఆపేసుకోవడం సగటు పౌరుడికి కష్టమే.. అందుకే చలిని సైతం లెక్క చేయకుండా పొగమంచులోనే బయటకు వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువసేపు చలిలో ఉంటే శరీరంలో జరిగే షాకింగ్ మార్పులు ఇవీ..
ప్రతి ఏడాది చలి, ఎండ తీవ్రత పెరుగుతూ వస్తోంది. వేసవిలో భానుడి ప్రతాపం నిప్పుల కుంపటిలా ఎలా మారుతుందో.. అలాగే చలికాలం వచ్చిదంటే వాతావరణం ఏ ధృవప్రాంతాన్నో తలపించేలా మారిపోతోంది. చాలా చోట్ల ఉదయపు వాతావరణం 12డిగ్రీలు కూడా నమోదు అవుతోంది. వాతావరణానికి భయపడి పనులు ఆపేసుకోవడం సగటు పౌరుడికి కష్టమే.. అందుకే చలిని సైతం లెక్క చేయకుండా పొగమంచులోనే బయటకు వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటారు. చలిని అధిగమించేందుకు స్వెట్టర్లు, దుప్పట్లు ఉపయోగించినా వాటి ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుంది. చలిలో ఎక్కువసేపు గడపడం వల్ల శరీరంలో షాకింగ్ మార్పులు చోటు చేసుకుంటాయి. వాటి గురించి వైద్యులు చెబుతున్న విషయాలేంటో తెలుసుకుంటే..
అల్పపీడనం..(Hypothermia)
అతి చల్లని వాతావరణంలోకి వెళ్లినప్పుడు శరీరం అల్పోష్ణస్థితికి తొందరగా గురవుతుంది. చలిని అధిగమించేందుకు శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. ఎక్కువ వేడి తొందరగా కోల్పోవడం శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది. ఇది వణుకు, గందరగోళం, అపస్మారకస్థితిలోకి జారుకోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది.
ఇది కూడా చదవండి: ఏలకుల పాలకు ఇంత శక్తి ఉందా? రాత్రి పడుకునేముందు తాగితే జరిగేదిదీ..!
గడ్డకట్టడం..(Frostbite)
శరీరంలో చలికి బహిర్గలతమయ్యే భాగలు దారుణమైన ప్రభావానికి గురవుతాయి. ముఖ్యంగా ముఖం, కాళ్లు, చేతులు ఈ కోవలోకి వస్తాయి. తిమ్మిర్లు, రంగు మారడం, కణజాలం చనిపోవడం జరుగుతుంది. చలిగా ఉన్న పొడి గాలులు పీల్చుకోవడం వల్ల గొంతు, శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయి.
శ్వాసకోశ సమస్యలు..(Respiratory issues)
చల్లని గాలుల కారణంగా శ్వాసకోశ వ్యవస్థ తీవ్ర ప్రభావానికి గురవుతుంది. ఇది ఆస్తమా లేదా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఉన్నవారికి ప్రాణాంతకంగా మారుతుంది. ఎక్కువ రోజులు ఇలాంటి వాతావరణానికి గురయితే శ్వాసకోశ సమస్యల తీవ్రత పెరుగుుతంది.
ఇది కూడా చదవండి: అల్పాహారంగా మొలకలు తింటే కలిగే షాకింగ్ ఫలితాలివీ..!
కార్డియోవాస్కులర్ స్ట్రెయిన్..(Cardiovascular strain)
విపరీతమైన చలి హృదయనాళ వ్యవస్థపై ఎక్కువ భారం పెంచుతుంది. శరీరం ఉష్ణోగ్రతను నిలకడగా ఉంచడానికి సాధారణం కంటే ఎక్కువ శ్రమ తీసుకుంటుంది. ఇది గుండె కొట్టుకునే వేగానికి, అధిక రక్తపోటుకు దారితోస్తుంది. ఇవి రెండూ కలిసి గుండెపోటు ప్రమాదాన్ని మరింత పెంచుతాయి.
అంటువ్యాధులు..(infections)
చల్లని వాతావరణం రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. ఇన్పెక్షన్లకు గురయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రతలు, పొడి గాలులకు లోనైనప్పుడు వైరస్లు, బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన శరీరం రోగనిరోధక వ్యవస్థను తలస్థం చేస్తుంది. ఈ కారణంగా సీజనల్ సమస్యలు అయిన ఫ్లూ, దగ్గు, జలుబు చాలా సులువుగా వస్తాయి. అలాగే బ్యాక్టీరియా, వైరస్ల కారణంగా సంక్రమించే జబ్బులు కూడా తొందరగా వస్తాయి. మళ్లీ కోవిడ్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇది కూడా చదవండి: Women: ఆడవాళ్లు వేసుకునే గాజుల వెనుక ఇన్ని రహస్యాలున్నాయా? వైద్యులు చెబుతున్న నిజాలివీ..!
((గమనిక: ఇది ఆరోగ్య నిపుణులు పలుచోట్ల పేర్కొన్న అంశాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఆరోగ్యం గురించి ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.