Share News

Grapes: ఈ కలర్ ద్రాక్ష తింటే మీ గుండె సేఫ్.. అంతేకాకుండా...

ABN , Publish Date - Nov 04 , 2024 | 04:11 PM

ద్రాక్ష పండు రుచికరమైనది. వాటిలో అనేక పోషకాలు ఉంటాయి. గ్రీన్, రెడ్, బ్లాక్ ఇలా ద్రాక్షలో పలు రకాలున్నాయి. అయితే, ఏ కలర్ ద్రాక్ష ఆరోగ్యానికి మంచిది. దాని ప్రయోజనాలు ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం...

Grapes: ఈ కలర్ ద్రాక్ష తింటే మీ గుండె సేఫ్.. అంతేకాకుండా...
grapes

Grapes: ద్రాక్ష పండు రుచికరమైనది. వాటిలో అనేక పోషకాలు ఉంటాయి. ప్రతి రోజు ద్రాక్ష తినడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యానికి మంచి చేయడమే కాకుండా క్యాన్సర్ కణాలను నివారిస్తుంది. బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది. జ్ఞాపకశక్తికి మంచి చేయడంతో పాటు ఎముకల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. గ్రీన్, రెడ్, బ్లాక్ ఇలా ద్రాక్షలో పలు రకాలున్నాయి. అయితే, ఏ కలర్ ద్రాక్ష ఆరోగ్యానికి మంచిది. దాని ప్రయోజనాలు ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం...


గ్రీన్ ద్రాక్ష:

మనం ఎంతో ఇష్టంగా తింటాం. ఇందులోనూ చాలా రకాల ద్రాక్షలు దొరుకుతాయి. కొన్ని తియ్యగా ఉంటే, మరికొన్ని పుల్లగా ఉంటాయి. ఈ కలర్ ద్రాక్షలో విటమిన్ సి, విటమిన్ కె ఉంటుంది. ఈ ద్రాక్ష తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. ఇందులో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ ద్రాక్షలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం మాత్రమే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ కలర్ ద్రాక్షలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి గ్రీన్ కలర్ ద్రాక్ష ఎంతో ఉపయోగపడుతుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడటమే కాకుండా మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.


ఎర్రద్రాక్ష:

ఈ కలర్ ద్రాక్ష ఖరీదైనది. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె ఉంటాయి. ఈ ద్రాక్ష గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంతోపాటు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎర్ర ద్రాక్షలో ఉన్న సహజ చక్కెర కారణంగా ఇది డయాబెటిక్ బాధితులకు మంచి చేస్తుంది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. చర్మ కాంతిని పెంచడమే కాకుండా కంటి చూపుకు మంచి చేస్తుంది. జామ్ చేయడానికి ఎర్రద్రాక్షను ఎక్కువగా ఉపయోగిస్తారు.


నల్ల ద్రాక్ష:

నల్ల ద్రాక్ష తినడానికి చాలా రుచిగా ఉంటుంది. విటమిన్ సి, విటమిన్ కె ఉన్న ఈ ద్రాక్ష క్యాన్సర్ కణాలను నివారిస్తుంది. ఇందులోనూ పుల్లని, తీపి కలిగిన రకాలు ఉంటాయి. ఈ కలర్ ద్రాక్షను ఎక్కువగా జూస్ తయారీలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఈ ద్రాక్షను వైన్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ మూడు రకాల ద్రాక్షలోనూ ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. మన అవసరానికి అనుగుణంగా వాటిలో ఏదైనా తినవచ్చు.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)


Also Read:

ప్రాణాయామంలో ఈ ఒక్క ట్రిక్ ఫాలో అయితే.. 100ఏళ్ళ ఆయుష్షు గ్యారెంటీ..

ఇలాంటి వారు గోరువెచ్చని నీరు తాగకూడదు.. తాగితే ఇక అంతే..!

రోజూ ఈ 5 వ్యాయామాలు చేస్తే క్యాన్సర్ ముప్పు 50 శాతం తగ్గుతుంది..

For More Health News and National News

Updated Date - Nov 04 , 2024 | 04:11 PM