Share News

Viral News: 21 ఏళ్ల విద్యార్థి కత్తితో దాడి.. 8 మంది మృతి, 17 మందికి గాయాలు

ABN , Publish Date - Nov 17 , 2024 | 07:02 AM

ఓ 21 ఏళ్ల కాలేజ్ విద్యార్థి పలువురిపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో 8 మంది మరణించగా, 17 మంది గాయపడ్డారు. ఈ విషాధ ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

Viral News: 21 ఏళ్ల విద్యార్థి కత్తితో దాడి.. 8 మంది మృతి, 17 మందికి గాయాలు
Wuxi China

చైనా (china) లోని వుక్సీ నగరంలో ఓ 21 ఏళ్ల విద్యార్థి కత్తి పట్టుకుని హల్ చల్ సృష్టించాడు. ఆ క్రమంలో పలువురిపై దాడి చేయగా ఎనిమిది మంది మరణించారు. మరో 17 మంది కూడా గాయపడ్డారు. జియాంగ్సు ప్రావిన్స్‌లోని వుక్సీ వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీలో శనివారం సాయంత్రం దాడి జరిగిందని అక్కడి పోలీసులు తెలిపారు. ఈ సంవత్సరం కళాశాల నుంచి పట్టభద్రుడైన 21 ఏళ్ల వ్యక్తిగా గుర్తించబడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు యిక్సింగ్‌లోని పోలీసులు తెలిపారు.


ఇందుకే దాడి చేశాడా..

అయితే ఆ యువకుడు కత్తితో అనేక మందిపై ఎందుకు ఎటాక్ చేశాడనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఆ విద్యార్థి మానసిక పరిస్థితి సరిగానే ఉందా లేదా మద్యం మత్తులో దాడి చేశాడా అనే కోణంలో కూడా అక్కడి పోలీసులు ఆరా తీస్తున్నారు. దీంతోపాటు ఆ యువకుడితో ఇది వరకు ఎవరైనా గొడవ పడ్డారా. ప్రతీకారం తీర్చుకునేందుకే ఎటాక్ చేశాడా అనే సమాచారం కూడా అధికారులు సేకరిస్తున్నారు. ఏది ఏమైనా కత్తితో అంతమందిపై దాడి చేసి చంపేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటన గురించి తెలిసిన నెటిజన్లు అనేక విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. లవ్ ఫెయిల్యూర్ ఒత్తిడితో దాడి చేశాడేమోనని వ్యాఖ్యానిస్తున్నారు.


గతంలో సైతం

అంతేకాదు ఇటీవల చైనాలోని దక్షిణ నగరంలోని జుహైలోని స్పోర్ట్స్ సెంటర్‌లో ఒక 62 ఏళ్ల డ్రైవర్ జనాలపైకి తన కారుతో వేగంగా దూసుకెళ్లిన ఘటనలో 35 మంది మరణించగా, 43 మంది గాయపడ్డారు. దశాబ్ద కాలంలో చైనాలో జరిగిన ఘోర ప్రమాదాల్లో ఈ ఘటన ఒకటి. ఈ విషయంపై అధికారులు సమాచారం అందించారు. ఈ ఘోరమైన దాడిలో కనీసం 43 మంది గాయపడ్డారని ప్రకటించారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన తర్వాత డ్రైవర్ తనను తాను పొడుచుకున్నాడని, ఆ తర్వాత అతను కోమాలోకి వెళ్లి ఆసుపత్రిలో చేరాడని పోలీసులు తెలిపారు.

లక్ష్యంగా దాడులు

పౌరులను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక సంఘటనలు జరగడం చైనాలో చాలా అరుదు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత ఇది చోటుచేసుకోవడం విశేషం. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి దాడులు పెరిగడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎవరైనా కావాలనే దాడి చేయిస్తున్నారా లేదా వేరే ప్రత్యర్థి దేశాల వారు ఎవరైనా దాడి ప్లాన్ చేశారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఈ ఘటనల నేపథ్యంలో స్థానిక ప్రజలు మాత్రం భయాందోళన చెందుతున్నారు.


ఇవి కూడా చదవండి:

Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..

PPF Account: ఉపయోగించని మీ పీపీఎఫ్ ఖాతాను ఇలా యాక్టివేట్ చేసుకోండి..

Read More International News and Latest Telugu News

Updated Date - Nov 17 , 2024 | 07:15 AM