Indian Student: కెనడాలో భారతీయ విద్యార్థిపై కాల్పులు
ABN , Publish Date - Apr 14 , 2024 | 02:58 PM
కెనడాలో భారతీయ విద్యార్థి చిరాగ్ అంటిల్‌పై కాల్పులు జరిగాయి. వాంకోవర్ ప్రాంతంలో ఆడి కారులో ఉన్న చిరాగ్‌పై ఈ నెల 12వ తేదీన కాల్పులు జరిగాయి. కాల్పుల శబ్దం విని స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కారు డోర్ ఓపెన్ చేసి చూడగా చిరాగ్ విగతజీవిగా కనిపించాడు.
ఏబీఎన్ ఇంటర్నెట్: కెనడాలో (Canada) భారతీయ విద్యార్థి చిరాగ్ అంటిల్‌పై కాల్పులు జరిగాయి. వాంకోవర్ ప్రాంతంలో ఆడి కారులో ఉన్న చిరాగ్‌పై 12వ తేదీన కాల్పులు జరిగాయి. కాల్పుల శబ్దం విని స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కారు డోర్ ఓపెన్ చేసి చూడగా చిరాగ్ విగతజీవిగా కనిపించాడు. వెంటనే చిరాగ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.
Israel Iran Tensions: ఇరాన్ దాడిపై ఇజ్రాయెల్ ప్రధాని రియాక్ట్.. ఏమన్నారంటే.
పై చదువుల కోసం చిరాగ్ 2022లో కెనడా వెళ్లాడు. చిరాగ్ స్వస్థలం హర్యానాలో గల సోనిపట్. కెనడాలో ఎంబీఏ చేస్తూ.. పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఇంతలో విషాద ఘటన జరిగింది. చిరాగ్ మృతదేహం భారత్ తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ తగిన ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులు కోరారు. చిరాగ్‌ను చివరి చూపు చూసి, అంత్యక్రియలు నిర్వహిస్తామని చెబుతున్నారు.
Iran Attacks: ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు మొదలు.. అగ్ర దేశాల సపోర్ట్
కాల్పులు జరిగిన రోజు ఉదయం చిరాగ్‌తో మాట్లాడానని చిరాగ్ సోదరుడు వివరించారు. ఆ సమయంలో చిరాగ్ తనతో సంతోషంగా మాట్లాడారని పేర్కొన్నారు. కాల్పుల జరిగిన తర్వాత పోలీసులతో టచ్‌లో ఉన్నామని, చిరాగ్ స్నేహితులు కూడా తమతో మాట్లాడుతున్నారని వివరించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం