Indian Passengers: 60 మంది భారత ప్రయాణికులకు ఇబ్బందులు.. తిండి, నీరు లేకుండా 14 గంటలకు పైగా..
ABN , Publish Date - Dec 02 , 2024 | 08:13 AM
ముంబై నుంచి మాంచెస్టర్ వెళ్తున్న విమానంలోని భారతీయ ప్రయాణికులు కువైట్ ఎయిర్‌పోర్టులో దాదాపు 14 గంటలకు పైగా చిక్కుకుపోయారు. ఆ క్రమంలో తమకు తిండి, పానీయం లేకుండా పోయిందని, ఇంకా ఎలాంటి సాయం అందలేదని ప్రయాణికులు చెబుతున్నారు.
కువైట్ విమానాశ్రయం(Kuwait Airport)లో భారతీయ ప్రయాణికులు (Indian Passengers ) చిక్కుకుపోయారు. ముంబై నుంచి మాంచెస్టర్ వెళ్తున్న గల్ఫ్ ఎయిర్ విమానం సాంకేతిక లోపంతో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఫ్లైట్ ఇంజిన్ నుంచి పొగలు వస్తున్నాయన్న సమాచారం మేరకు ఈ చర్య తీసుకున్నారు. అయితే ఆ సమయంలో ప్రయాణికులకు అక్కడ ఎటువంటి సదుపాయలు కల్పించలేదని భారత ప్రయాణికులు పేర్కొన్నారు. ఆ కారణంగా వారు 14 గంటలకు పైగా ఆహారం, నీరు లేకుండా విమానాశ్రయంలో ఉండాల్సి వచ్చిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
కూర్చునేందుకు కూడా..
వాస్తవానికి ముంబై నుంచి మాంచెస్టర్ వెళ్తున్న విమానం ఇంజిన్ వైఫల్యం కారణంగా, కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో పొగలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 60 మంది భారతీయ ప్రయాణికులు దాదాపు 23 గంటల పాటు విమానాశ్రయంలో వేచి ఉన్నారు. ఆ క్రమంలో వారికి కూర్చునేందుకు సరిపడా స్థలం కూడా లేదని, ఆహారం, నీరు కూడా అందించలేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే భారత ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో ప్రయాణికులకు సహాయం లేదా సమస్యకు పరిష్కారం గురించి గల్ఫ్ ఎయిర్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన రాలేదు.
ఎంబసీ లాంజ్‌లో
కువైట్‌లోని భారతీయులు వీసా ఆన్ అరైవల్ (VoA)కి అర్హులు కాదు. కాబట్టి అక్కడి భారత రాయబార కార్యాలయం వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ వారు విమానాశ్రయం నుంచి బయటకు రాలేరు. కువైట్‌లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సమావేశం కారణంగా విమానాశ్రయ హోటల్‌లు అందుబాటులో లేకపోవడంతో చిక్కుకుపోయిన భారతీయుల సమస్యలు మరింత పెరిగాయి. దీంతో వారికి విమానాశ్రయ లాంజ్‌లో బస చేసేందుకు ఎంబసీ ఏర్పాట్లు చేసింది.
వారికి హోటళ్లలో వసతి
చిక్కుకుపోయిన ప్రయాణీకులలో ఒకరైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శివాంశ్ సోషల్ మీడియాలో ఇలా పేర్కొన్నారు. బ్రిటీష్ పాస్‌పోర్ట్ హోల్డర్లందరికీ VoAతో వారి హోటళ్లలో వసతి కల్పించారు. కానీ భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు అలాంటి సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. ఆహారం లేదా ఎలాంటి సహాయం లేకుండా ఒంటరిగా మిగిలిపోయామన్నారు.
సహాయం పొందలేకపోతున్నాము
మరో ప్రయాణికుడు సాయి సామ్రాట్ ఆనందపు తన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి @సామ్రాట్ చింటూ ట్వీట్ చేస్తూ, "నేను హైదరాబాద్ నుంచి మాంచెస్టర్‌కి బహ్రెయిన్‌లో ట్రాన్సిట్‌తో ప్రయాణిస్తున్నాను. మా విమానం తెల్లవారుజామున 2.10 గంటలకు ప్రారంభమైంది. కానీ 1.5 గంటల ఎడమ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఫలితంగా కువైట్ సిటీలో ల్యాండ్ అయింది. మేము 6 గంటలకు పైగా సహాయం కోసం ఎదురుచూస్తున్నాము. కానీ బ్రిటిష్ పౌరులు, GCC నివాసితులకు మాత్రమే సౌకర్యాలు కల్పించారు. భారతీయులమైన మేము సహాయం పొందలేకపోతున్నాము. మాతోపాటు పిల్లలు, వృద్ధులు ఉన్నారు. మాంచెస్టర్‌కు మా విమానం గురించి సమాచారం ఇవ్వలేదు. ఫ్రెష్ అప్ అవ్వాలి కాబట్టి మాకు వసతి కల్పించాలని కోరారు.
భారత రాయబార కార్యాలయం స్పందన
ఈ ఘటనపై కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ఆదివారం రాత్రి స్పందించింది. ఎయిర్‌పోర్టు హోటళ్లలో ప్రయాణికులకు వసతి కల్పించేందుకు కృషి చేస్తున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
ఇవి కూడా చదవండి:
Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..
Boat Capsizes: నదిలో పడవ బోల్తా.. 27 మంది మృతి, 100కుపైగా గల్లంతు..
Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Read More International News and Latest Telugu News