Earthquake: 7.5 తీవ్రతతో తీవ్ర భూకంపం..హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం
ABN , Publish Date - Apr 03 , 2024 | 06:41 AM
తైవాన్(Taiwan)లోని తైపీ(Taipei)లో బుధవారం 7.5 తీవ్రతతో తీవ్రమైన భూకంపం(earthquake) సంభవించింది. దీంతో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన జపాన్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అలలు మూడు మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉందని వెల్లడించింది.
తైవాన్(Taiwan)లోని తైపీ(Taipei)లో బుధవారం 7.5 తీవ్రతతో తీవ్రమైన భూకంపం(earthquake) సంభవించింది. దీంతో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. బలమైన భూకంపం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పటివరకు ఈ ఘటనలో నలుగురు మృత్యువాత చెందగా, 50 మందికిపైగా గాయపడినట్లు అధికారులు ప్రకటించారు. అయితే తైవాన్ భూకంప పర్యవేక్షణ ఏజెన్సీ ఈ భూకంప తీవ్రతను 7.2గా ప్రకటించగా, అమెరికా జియోలాజికల్ సర్వే మాత్రం 7.5గా పేర్కొంది.
మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన జపాన్(japan) ప్రభుత్వం సునామీ హెచ్చరికలు(tsunami alerts) జారీ చేసింది. అలలు మూడు మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో ఒకినావా, మియాకోజిమా, యాయామా ద్వీపం చుట్టుపక్కల నివాసితులు వెంటనే ఖాళీ చేయాలని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. సునామీ అలలు తీరాన్ని సమీపిస్తున్నాయని, వీలైనంత త్వరగా ఖాళీ చేయాలని వెల్లడించింది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: భారత టెకీలపై యూఎస్ వీసా భారం
భూకంపం తీవ్రతను ఎలా కొలుస్తారు?
భూకంపాలను రిక్టర్ స్కేల్(richter scale) ఉపయోగించి కొలుస్తారు. దీనిని రిక్టర్ మాగ్నిట్యూడ్ టెస్ట్ స్కేల్ అంటారు. భూకంపాలను(earthquake) రిక్టర్ స్కేలుపై 1 నుంచి 9 వరకు కొలుస్తారు. భూకంపాన్ని భూకంప కేంద్రం నుంచి కొలుస్తారు. భూకంపం సమయంలో భూమి లోపల నుంచి విడుదలయ్యే శక్తి తీవ్రత దాని ద్వారా నిర్ణయిస్తారు. 7 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవిస్తే భారీ భూకంపంగా పరిగణిస్తారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: S Jaishankar: భారత్‌కు శాశ్వత స్థానం దక్కాలంటే.. ఆ పని చేయాల్సి ఉంటుంది