Home » Taiwan
క్వార్టర్ ఫైనల్స్ వరకు అర్హత సాధించిన తైవాన్ మహిళా బాక్సర్ ఫైనల్స్ కు వెళ్లకుండానే వెనుదిరిగింది. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ టైలిల్ గెలిచిన ఆమె జెండర్ కు సంబంధించిన వివాదం ఎదుర్కొంటోంది.
తైవాన్- చైనా మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చైనా తన దూకుడు చర్యల నుంచి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలోనే మరోసారి చైనా సైన్యం తైవాన్ సరిహద్దుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. 7 చైనా నౌకాదళ నౌకలు, ఒక అధికారిక నౌక, 17 సైనిక విమానాలు సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 6 గంటల మధ్య తైవాన్ చుట్టూ తిరుగుతున్నట్లు కనిపించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
భార్య వివాహేతర సంబంధాన్ని బయటపెట్టేందుకు ఓ భర్త చేసిన పని.. చివరికి అతడినే దోషిని చేసింది. ఇంట్లో రహస్య కెమెరాలు అమర్చినందుకు అతడికి కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది.
దక్షిణకొరియా రాజధాని సియోల్ నుంచి తైవాన్‌లోని తైచుంగ్ వెళ్లాల్సిన ‘బోయింగ్ 737 మ్యాక్స్ 8’ విమానంలోని ప్రయాణీకులకు మార్గమధ్యంలో భయానక అనుభవం ఎదురైంది. విమాన క్యాబిన్ ‘ ప్రెషరైజేషన్ సిస్టమ్’ పనిచేయకపోవడంతో విమానం ప్రయాణిస్తున్న ఎత్తు ఒక్కసారిగా భారీగా తగ్గిపోయింది.
చైనా(china), తైవాన్(Taiwan) దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం మరింత పెరుగుతోంది. బీజింగ్ తన దుందుడుకు చర్యల నుంచి వైదొలగడం లేదు. ఈ క్రమంలోనే మరోసారి చైనా సైన్యం తైవాన్ సరిహద్దుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలో 13 చైనా విమానాలు, ఐదు నౌకాదళ నౌకలు, నాలుగు కోస్ట్ గార్డ్ నౌకలను మోహరించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
అప్పుడప్పుడు పార్లమెంట్లో విపక్షాలు తారాస్థాయిలో ఆందనళలు చేపట్టే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. గట్టిగట్టిగా నినాదాలు చేయడం, స్పీకర్ దగ్గరకు వెళ్లి నిరసన తెలపడం లాంటి సందర్భాలు..
విమానంలో సీటు కోసం ఇద్దరు ప్రయాణికులు పరస్పరం చేయిచేసుకున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తైవాన్ నుంచి అమెరికా వెళుతున్న ఈవీఏ ఎయిర్విమానంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
తైవాన్(Taiwan)లో ఈ నెలలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య దేశంలోని తూర్పు తీరంలో 80కి పైగా భూ ప్రకంపనలు(Earthquakes) సంభవించాయి. వీటిలో అత్యధిక తీవ్రత 6.3, 6గా నమోదైంది. భారత కాలమానం ప్రకారం ఈ రెండు రాత్రి 12 గంటల సమయంలో కొన్ని నిమిషాల వ్యవధిలోనే సంభవించాయి.
తైవాన్(Taiwan)లోని తైపీ(Taipei)లో బుధవారం 7.5 తీవ్రతతో తీవ్రమైన భూకంపం(earthquake) సంభవించింది. దీంతో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన జపాన్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అలలు మూడు మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉందని వెల్లడించింది.