Helicopter Missing: 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్సింగ్
ABN , Publish Date - Aug 31 , 2024 | 02:17 PM
22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ తర్వాత ఆకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. ఈ ఘటన రష్యా ఫార్ ఈస్ట్‌లోని కమ్‌చట్కా ద్వీపకల్పంలో చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ చుద్దాం.
రష్యా(Russia)లో ఘోర ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రష్యన్ ఫార్ ఈస్ట్‌లోని కమ్‌చట్కా ద్వీపకల్పంలో 22 మందితో ప్రయాణిస్తున్న రష్యన్ Mi8 హెలికాప్టర్ అదృశ్యమైనట్లు రష్యా ప్రభుత్వ మీడియా తెలిపింది. టాస్ ప్రకారం ఇది ద్వీపకల్పంలో పర్యాటక యాత్రలను నిర్వహించే విత్యాజ్ ఏరో ఎయిర్‌లైన్‌కు చెందినదని చెబుతున్నారు. వచ్కాజెట్స్ అగ్నిపర్వతం సందర్శన సమయంలో ఇది అదృశ్యమైనట్లు సమాచారం. రష్యాకు చెందిన ఫెడరల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ తప్పిపోయిన హెలికాప్టర్‌లో 22 మంది ఉన్నట్లు నివేదించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు విచారణ చేస్తున్నారు.
విచారణ
అయితే ఈ హెలికాప్టర్ ప్రమాదం ఎలా జరిగింది. ఈ ఘటనలో ఎంత మంది మరణించారనే సమాచారం తెలియాల్సి ఉంది. హెలికాప్టర్ అదృశ్యమైన సమయంలో అందులో ముగ్గురు సిబ్బందితో సహా మొత్తం 22 మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఎవరైనా కావాలని చేశారా అనే కోణంలో కూడా సమాచారం సేకరిస్తున్నారు.
ఆంక్షలు
ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దండయాత్రకు ప్రతిస్పందనగా ప్రవేశపెట్టిన పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల రష్యా విమానయాన పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. పౌర విమానాలలో పరికరాలు పనిచేయకపోవడం వల్ల అనేక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రష్యా యాజమాన్యంలోని విమానాలు EU గగనతలాన్ని ఉపయోగించగల సామర్థ్యంపై నిషేధాన్ని కలిగి ఉన్నాయి. అలాగే విమానయాన సంబంధిత సాంకేతికతను ఎగుమతి చేయడాన్ని కూడా నిషేధించాయి. వీటిలో కొన్ని రష్యన్ హెలికాప్టర్లు ఉన్నాయి. విడిభాగాల కోసం కంపెనీలు పెనుగులాడుతుండడంతో రష్యా విమానయాన సంస్థల భద్రత క్రమంగా క్షీణించింది. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ గత సంవత్సరం U.N. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO)కి అధికారికంగా ఫిర్యాదు చేసింది. అంతర్జాతీయ పౌర విమానయాన భద్రతకు హాని కలిగిస్తున్నాయని తెలిపింది.
ఇవి కూడా చదవండి:
Rahul Dravid:అండర్-19 జట్టులోకి సమిత్
Paytm: పేటీఎంకు మరో దెబ్బ.. సెబీ నోటీస్ నేపథ్యంలో షేర్లు ఏకంగా..
RBI: ఇకపై క్షణాల్లోనే లోన్స్.. గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ
Read More International News and Latest Telugu News