Share News

బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తత

ABN , Publish Date - Nov 10 , 2024 | 04:44 AM

బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఇస్కాన్‌ సంస్థను నిషేధించాలని చిట్టగాంగ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హెఫాజత్‌ ఎ ఇస్లాం పిలుపునివ్వడంతో వివాదం నెలకొంది.

బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తత

న్యూఢిల్లీ, నవంబరు 9: బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఇస్కాన్‌ సంస్థను నిషేధించాలని చిట్టగాంగ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హెఫాజత్‌ ఎ ఇస్లాం పిలుపునివ్వడంతో వివాదం నెలకొంది. ఛట్టోగ్రాంలో ఇటీవల జరిగిన ఓ ప్రదర్శనలో హెఫాజత్‌ కార్యకర్తల నినాదాల వీడియో ను ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇస్కాన్‌పై దాడి చేయాలని, కార్యకర్తలను చంపాలని కొందరు నినదించడం ఆ వీడియోలో కనిపించింది. ఇస్కాన్‌ భక్తులకు ముప్పు ఉందని తస్లీమా ఆందోళన వ్యక్తంచేశారు.

Updated Date - Nov 10 , 2024 | 04:44 AM