కుటుంబాలను కలిపి ఉంచుదాం
ABN , Publish Date - Aug 21 , 2024 | 05:03 AM
‘కుటుంబాలను కలిపి ఉంచుదాం’ పేరుతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగం ప్రకటించిన సరికొత్త విధాన నిర్ణయం లక్షలాది కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతోంది. ఈ నిర్ణయంతో చట్ట విరుద్ధంగా దేశంలో నివసిస్తున్న 5 లక్షల మంది దంపతులు, 50 వేల మంది సవతి
అమెరికా కొత్త పౌరసత్వ స్కీమ్ కింద దరఖాస్తుల స్వీకరణ
న్యూఢిల్లీ, ఆగస్టు 20: ‘కుటుంబాలను కలిపి ఉంచుదాం’ పేరుతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగం ప్రకటించిన సరికొత్త విధాన నిర్ణయం లక్షలాది కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతోంది. ఈ నిర్ణయంతో చట్ట విరుద్ధంగా దేశంలో నివసిస్తున్న 5 లక్షల మంది దంపతులు, 50 వేల మంది సవతి పిల్లలు లబ్ధి పొందనున్నారు. యూఎస్ పౌరసత్వానికి అర్హత రావడంతో నిన్నటి వరకూ అనిశ్చితితో నిండిన వారి జీవితాల్లో నిశ్చింత ఏర్పడనుంది. జూన్‌లో ఈ పథకాన్ని ప్రకటించారు. ఆగస్టు 19 నుంచి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. యూఎస్ పౌరుని పెళ్లి చేసుకుని, కనిష్ఠంగా పదేళ్లనుంచి అక్కడే నివాసం ఉంటున్న దంపతులు ఈ పథకానికి అర్హులు. జూన్ 17, 2024 నాటికి పదేళ్లు పూర్తయి ఉండాలన్నది నియమం. అలాగే 21 సంవత్సరాలు వయస్సు లోపల ఉన్న, అవివాహిత సవతి పిల్లలు కూడా ఈ పథకానికి అర్హులు. ఈ పథకం గురించి యూఎ్‌ససీఐఎస్ డైరెక్టర్ ఉర్ జద్దౌ మాట్లాడుతూ, ‘యూఎస్ పౌరులను పెళ్లి చేసుకున్న ఇతర దేశస్థులు... వారిలో చాలా మంది తల్లిదండ్రులు... మా దేశపు ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోని అనవసరపు అడ్డంకులతో నిరంతరం అనిశ్చితితో, అభద్రతతో జీవిస్తున్నారు. ఈ పథకంతో పౌరసత్వ సాధనకు ఆ అడ్డంకులు తొలిగిపోతాయి’ అని పేర్కొన్నారు.