Viral News: హిందువులపై దాడులు, ఆలయాల విధ్వంసం.. ఎందుకింత కక్ష సాధింపు..
ABN , Publish Date - Nov 28 , 2024 | 08:26 AM
బంగ్లాదేశ్‌లో హిందువులకు వ్యతిరేకంగా అల్లర్లు జరుగుతున్నాయి. పలువురు ఇస్లామిక్ వాదులు హిందువులకు వ్యతిరేకంగా ర్యాలీలు చేసి దేవాలయాలను ధ్వంసం చేయడంతోపాటు దాడులు చేసి దేశం విడిచి వెళ్లిపోవాలని నినాదాలు చేస్తున్నారు.
బంగ్లాదేశ్(Bangladesh)లో హిందువుల పరిస్థితి దారుణంగా తయారైంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన మంత్రి ముహమ్మద్ యూనస్ ప్రభుత్వ ప్రోద్బలంతో, ఇస్లామిక్ ఛాందసవాదులు ఇప్పుడు హిందువులకు వ్యతిరేకంగా బహిరంగంగా వీధుల్లోకి వచ్చి హిందువులపై దాడులు చేస్తున్నారు. మరోవైపు ఇస్కాన్ బంగ్లాదేశ్‌కు చెందిన హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ ప్రభుపై దేశద్రోహం కేసు వేసి, ఆయన బెయిల్ కూడా తిరస్కరించారు. దీంతో భారత్‌లోనూ బంగ్లాదేశ్‌పై వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మహమ్మద్ యూనస్ ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్య పరిష్కిరంచాలని ఇస్కాన్ బంగ్లాదేశ్ డిమాండ్ చేసింది.
హిందూ సంఘాల నిరసన
మంగళవారం (నవంబర్ 27న) అగర్తలాలో బంగ్లాదేశ్ అసిస్టెంట్ హైకమిషన్ ఎదుట ఇస్కాన్ సన్యాసి, బంగ్లాదేశ్ సనాతని జాగరణ్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణ దాస్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సనాతని హిందూ సేన సభ్యులు, మద్దతుదారులు నిరసన చేపట్టారు. బంగ్లాదేశ్‌లో రెచ్చగొట్టడం, దేశద్రోహం వంటి పలు అభియోగాల కింద నిర్బంధించబడిన ఇస్కాన్ నేత చిన్మోయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిని వెంటనే విడుదల చేయాలని పలు హిందూ సంస్థలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో జాతీయ, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు అనుగుణంగా చిన్మోయ్ కృష్ణ దాస్‌కు విముక్తి కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరారు.
నిరంతరం దాడులు
నవంబర్ 25న ఢాకాలో బంగ్లాదేశ్ పోలీసుల డిటెక్టివ్ బ్రాంచ్ పోలీసులు చిన్మోయ్ కృష్ణ దాస్‌ను అరెస్టు చేయడంపై తీవ్ర ఆందోళన మొదలైంది. ఈ చర్య గురించి బంగ్లాదేశ్‌లోని వాక్ స్వాతంత్ర్యం, మత సామరస్యం, మైనారిటీ కమ్యూనిటీల రక్షణ గురించి పలు హిందు సంస్థలు తీవ్రమైన ఆందోళనలను వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే పలువురు ఇస్లామిక్ వాదులు బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలు, దుకాణాలపై నిరంతరం దాడులు చేస్తున్నారు. ఇప్పటికే హజారిలేన్‌లోని శివాలయం కూల్చివేయబడగా, ఛటోగ్రామ్‌లోని మానస మాత ఆలయాన్ని కూడా ధ్వంసం చేశారు. మన్హర్‌లో హిందూ దుకాణాలను లూటీ చేశారు. ఈ క్రమంలో లోక్‌నాథ్ ఆలయం, మానసమాత ఆలయం, కాళీమాత దేవాలయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
250 మంది హిందువులు
బంగ్లాదేశ్ మా పూర్వీకుల ఇల్లు, ఇది మా జన్మస్థలమని ఇస్కాన్ బంగ్లాదేశ్ జనరల్ సెక్రటరీ చారుచంద్ర దాస్ అన్నారు. బంగ్లాదేశ్‌లో అనేక ప్రాంతాలలో సనాతనవాదులపై కొనసాగుతున్న హింస, దాడులను తాము ఖండిస్తున్నట్లు చెప్పారు. సనాతనీ సమాజం శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించాలని యూనస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.
అందరికీ న్యాయం జరిగేలా చూడాలని, ప్రతి పౌరుడు తమ విశ్వాసం ప్రకారం మతాన్ని స్వేచ్ఛగా ఆచరించడానికి అనుమతించాలని యూనస్ ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని రాధా రామన్ దాస్ అన్నారు. 3 కోట్ల మంది హిందువులు భయాందోళన చెందుతున్నట్లు తెలిపారు. బంగ్లాదేశ్‌లో ఛాందసవాదుల దాడిలో దాదాపు 250 మంది హిందువులు గాయపడ్డారని, మరికొంత మంది మరణించారని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Fengal Cyclone Alert: భారీ తుపాను హెచ్చరిక.. స్కూళ్లు, కాలేజీలు బంద్..
Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..
Read More International News and Latest Telugu News