Share News

Bangladesh unrest: మా వాళ్ల జాడ చెప్పండి.. సైన్యానికి, హిందువులకు మధ్య స్వల్ప ఘర్షణ

ABN , Publish Date - Aug 13 , 2024 | 09:13 PM

బంగ్లాదేశ్‌లోని మైనారిటీ హిందువులకు, సైన్యానికి మధ్య మంగళవారంనాడు స్వల్ప ఘర్షణ తలెత్తింది. రిజర్వేషన్ల అంశంపై ఇటీవల తలెత్తిన ఆందోళనల పర్యవసానంగా షేక్ హసీనా ఇటీవల ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడం, మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి రావడం, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల్లో మైనారిటీ హిందువులపై దాడులు చోటుచేసుకున్నాయి.

Bangladesh unrest: మా వాళ్ల జాడ చెప్పండి.. సైన్యానికి, హిందువులకు మధ్య స్వల్ప ఘర్షణ

ఢాకా: బంగ్లాదేశ్‌లోని మైనారిటీ హిందువులకు, సైన్యానికి మధ్య మంగళవారంనాడు స్వల్ప ఘర్షణ తలెత్తింది. రిజర్వేషన్ల అంశంపై ఇటీవల తలెత్తిన ఆందోళనల పర్యవసానంగా షేక్ హసీనా ఇటీవల ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడం, మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి రావడం, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల్లో మైనారిటీ హిందువులపై దాడులు జరగడం వంటి వరుస ఘటనలు చోటుచేసుకున్నాయి.


కాగా, జమున గెస్ట్ హౌస్ వద్ద ఇటీవల తలెత్తిన హింసాత్మక ఘటనల్లో జాడ తెలియకుండా పోయిన తమ కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం పలువురు హిందువులు మంగళవారంనాడు ప్లకార్డులతో నిరసనకు దిగారు. జమున గెస్ట్ హౌస్‌లోనే తాత్కాలిక ప్రభుత్వ సారథి ముహమ్మద్ యూనస్ ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. దీంతో అప్రమత్తమైన సైన్యం హిందూ నిరనసకారులను అడ్డుకుంది. ఈ క్రమంలో వీరి మధ్య స్వల్ప ఘర్షణ తలెత్తింది.

Bangladesh: హక్కులు అందరికీ సమానమే.. హిందూ ఆలయాన్ని సందర్శించిన ముహమ్మద్ యూనస్


సంయమనంతో ఉండాలని యూనస్ పిలుపు..

కాగా, మైనారిటీ హిందువులకు సంఘీభావం తెలుపుతూ, ఐక్యతా యత్నాల్లో భాగంగా ముహమ్మద్ యూనస్ మంగళవారంనాడు ఢాకాలోని ప్రఖ్యాత ఢాకేశ్వరి టెంపుల్‌ను దర్శించారు. అక్కడికి హిందూ ఆధ్యాత్మిక ప్రతినిధులను కలుసుకున్నారు. మత ప్రసక్తి లేకుండా ప్రతి ఒక్కరి హక్కుల పరిరక్షణకు పాటుపడతామని భరోసా ఇచ్చారు. హక్కులు అందరికీ సమానమేననని, మైనారిటీ, మెజారిటీ జనాభా ప్రస్తావన లేకుండా అంతా ఐక్యంగా ఉండాలని, సంయమనం పాటించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

Updated Date - Aug 13 , 2024 | 09:13 PM