Share News

Public Holiday: కొత్త తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు.. ఆగస్టు 15న హాలిడే రద్దు

ABN , Publish Date - Aug 14 , 2024 | 07:52 AM

‌బంగ్లాదేశ్‌(Bangladesh)లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆగస్టు 15న జాతీయ సెలవుదినాన్ని(public holiday) రద్దు చేశారు. ఈ రోజున బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు, బహిష్కరించబడిన ప్రధాన మంత్రి షేక్ హసీనా తండ్రి బంగాబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ హత్యకు గురయ్యారు.

Public Holiday: కొత్త తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు.. ఆగస్టు 15న హాలిడే రద్దు
Bangladesh

‌బంగ్లాదేశ్‌(Bangladesh)లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆగస్టు 15న జాతీయ సెలవుదినాన్ని(public holiday) రద్దు చేశారు. ఈ రోజున బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు, బహిష్కరించబడిన ప్రధాన మంత్రి షేక్ హసీనా తండ్రి బంగాబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ హత్యకు గురయ్యారు. అయితే ఆగస్టు 15న ప్రతి ఏటా సెలవు దినంగా ప్రకటిస్తారు. కానీ నిన్న రాత్రి జరిగిన అడ్వైజరీ కౌన్సిల్ సమావేశంలో ఆగస్టు 15న సెలవు రద్దుకు ఆమోదం తెలిపినట్లు చీఫ్ అడ్వైజర్ కార్యాలయం తెలిపింది. మహ్మద్ యూనస్ వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించిన ఒక రోజు తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సమావేశానికి అవామీ లీగ్ నేతలు హాజరుకాలేదు. కొన్ని పార్టీలు ఈ రోజును జాతీయ సెలవుదినంగా ఉంచడానికి అనుకూలంగా ఉండగా, కొంత మంది మాత్రం వ్యతిరేకించారు.


అప్పటి నుంచి

బంగ్లాదేశ్‌లో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న జాతీయ సంతాప దినం జరుపుకుంటారు. 1975లో ఈ రోజున షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్‌ను అతని కుటుంబంతో సహా ఆర్మీ అధికారులు హత్య చేశారు. ఆ సమయంలో హసీనా, ఆమె ఇద్దరు మైనర్ పిల్లలు, ఆమె చెల్లెలు షేక్ రెహానా జర్మనీకి విహారయాత్రకు వెళ్లారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో ఆగస్టు 15ని జాతీయ సంతాప దినంగా జరుపుకుంటారు. అమెరికా వ్యవస్థాపకుడు అబ్రహం లింకన్, బ్రిటన్‌కు చెందిన విన్‌స్టన్ చర్చిల్ జ్ఞాపకార్థం కూడా ఈ దేశాల్లో పబ్లిక్ హాలిడే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌లో కూడా దాని అవసరం లేదని ఏబీ పార్టీ కన్వీనర్ సోలేమాన్ చౌదరి అన్నారు. షేక్ హసీనా రాజీనామా చేసిన క్రమంలో దేశం విడిచిపెట్టిన వెంటనే ఆగ్రహించిన పలువురు బంగాబంధుకు అంకితం చేసిన మ్యూజియాన్ని తగులబెట్టారు.


అగౌరవం

మన మనుగడకు ఆసరాగా నిలిచిన జ్ఞాపకాలే బూడిదయ్యాయి. జాతిపిత బంగబంధు షేక్ ముజీబుర్ రెహమాన్‌కు అగౌరవం ఇస్తున్నారని షేక్ హసీనా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆయన నాయకత్వంలో మనం స్వాతంత్ర్యం పొందాము. ఈ క్రమంలో ఆగస్టు 15న జాతీయ సంతాప దినాన్ని గౌరవప్రదంగా, గంభీరంగా జరుపుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. దయచేసి బంగాబంధు భవన్‌లో పూలమాలలు వేసి నివాళులు అర్పించి, మరణించిన ఆత్మల మోక్షానికి ప్రార్థించాలని కోరారు.

ఈ క్రమంలోనే 1971 విముక్తి యుద్ధం తర్వాత చెలరేగిన హింసను గుర్తుచేసుకున్నారు. సోదర సోదరీమణులారా ఆగస్ట్ 15, 1975న బంగ్లాదేశ్ అధ్యక్షుడు, జాతిపిత బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ దారుణంగా హత్య చేయబడ్డారు. ఆయనతోపాటు, నా తల్లి బేగం ఫజిలతున్నెసా, నా ముగ్గురు సోదరులు, స్వాతంత్య్ర సమరయోధుడు కెప్టెన్ షేక్ కమల్, స్వాతంత్ర్య సమరయోధుడు లెఫ్టినెంట్ షేక్ జమాల్, వారి కొత్తగా పెళ్లయిన భార్యలు, నా చిన్న సోదరుడు 10 సంవత్సరాల వయస్సు గల షేక్ రస్సెల్ కూడా నిర్దాక్షిణ్యంగా చంపబడ్డారు. స్వాతంత్ర్య సమరయోధుడు షేక్ నాసర్, రాష్ట్రపతి సైనిక కార్యదర్శి బ్రిగేడియర్ జమీల్ ఉద్దీన్, పోలీసు అధికారి సిద్ధికుర్ రెహమాన్ కూడా దారుణంగా హత్య చేయబడ్డారు.


ఇవి కూడా చదవండి:

Droupadi Murmu: 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం


సెబీ చీఫ్‌, అదానీపై.. 22న దేశవ్యాప్త ఉద్యమం

హత్యాచారం కేసు సీబీఐకి!

Read More International News and Latest Telugu News

Updated Date - Aug 14 , 2024 | 07:54 AM