Share News

Bangladesh: ఇస్కాన్ కృష్ణదాస్ అనుచరులు, పోలీసుల ఘర్షణలో యువ లాయర్ మృతి

ABN , Publish Date - Nov 26 , 2024 | 09:27 PM

కోర్టు వెలుపల పోలీసు వ్యాను నుంచే కృష్ణదాస్ తన అనుచరులకు విక్టరీ సంకేతాలిస్తూ, ఐక్య బంగ్లాదేశ్‌ను తాము కోరుకుంటున్నట్టు సందేశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది.

Bangladesh: ఇస్కాన్ కృష్ణదాస్ అనుచరులు, పోలీసుల ఘర్షణలో యువ లాయర్ మృతి

ఢాకా: 'ఇస్కాన్' (ISKCON) ప్రముఖ నేత చిన్మయ్ కృష్ణదాస్ (Krishandas) అరెస్టు ఢాకాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. హిందువులపై దాడులకు నిరసనగా ఇటీవల ర్యాలీ నిర్వహించిన కృష్ణదాస్‌ను బంగ్లా 'జెండా'ను అవమానించారనే ఆరోపణలపై సోమవారం ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అనంతరం మంగళవారం ఉదయం చిట్టగ్యాంగ్ కోర్టు ముందు హాజరుపరచడంతో వందలాది మంది కృష్ణదాస్ అనుచరులు కోర్టు ఆవరణ వద్ద గుమిగూడారు. ముందస్తు బెయిలు ఇవ్వడానికి నిరాకరించిన కోర్టు ఆయనను జైలుకు పంపుతూ ఆదేశాలివ్వడంతో కోర్టు వెలుపల తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఖైదీలను తీసుకువెళ్లే వ్యానులో కృష్ణదాస్‌ను ఎక్కించండంతో పెద్ద సంఖ్యలో ప్రతిఘటన ఎదురైంది. కృష్ణదాసును విడుదల చేయాలంటూ నిరసనకారులు వ్యానును అడ్డుకోవడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు సౌండ్ గ్రెనేడ్లు ఉపయోగిస్తూ, లాఠీచార్జి జరిపారు. ఈ ఘర్షణలో పలువురు గాయపడగా, తీవ్రంగా గాయపడిన 32 ఏళ్ల యువకుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. ఆ యువకుని చిట్టగ్యాంగ్ బార్ అసోసియేషన్‌కు చెందిన 32 ఏళ్ల సైఫుల్ ఇస్లామ్‌గా గుర్తించారు.

ISKCON: 'ఇస్కాన్' చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును అరెస్టు చేసిన బంగ్లా ప్రభుత్వం


సంచలన ఆరోపణ

కాగా, సైఫుల్ ఇస్లామ్‌ మృతిపై చిట్టగ్యాంగ్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నజీమ్ ఉద్దీమ్ చౌదరి సంచలన ఆరోపణ చేశారు. చిన్మయ్ కృష్ణదాసు అనుచరులు కొందరు సైఫుల్‌ను మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతలో రంగం కన్వెషన్ హాలుకు ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి నరకి చంపినట్టు తనకు ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టు తెలిపారు. అయితే రంగం కన్వెన్షన్ హాలు పక్కన ఉన్న రోడ్డుపై సైఫుల్‌ను కొందరు చిన్మయ్ అనుచరులు అడ్డుకుని దాడి చేశారని, స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడని గోలుమ్ రసూర్ మార్కెట్ ఉద్యోగి ఒకరు తెలిపారు. కాగా, పోలీసులకు, ఇస్కాన్ అనుచరులకు మధ్య ఘర్షణలో జర్నలిస్టులతో సహా సుమారు 10 మంది గాయపడ్డారు. ఐదుగురు సీఎంసీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


వ్యాను నుంచే కృష్ణదాస్ సందేశం

కాగా, కోర్టు వెలుపల పోలీసు వ్యాను నుంచే కృష్ణదాస్ తన అనుచరులకు విక్టరీ సంకేతాలిస్తూ, ఐక్య బంగ్లాదేశ్‌ను తాము కోరుకుంటున్నట్టు సందేశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. దేశం పట్ల సనాతనీయులగా మనకు బాధ్యతలు ఉన్నాయని, హిందువుల డిమాండ్లపై శాంతియుతంగానే నిరసనలు కొసాగించాలని, శాంతికి ఎలాంటి విఘాతం కలిగించరాదని ఆయన ఆ వీడియోలో కోరారు.


ఇవి కూడా చదవండి..

ఉక్రెయిన్‌కు..అమెరికా యాంటీ-పర్సనల్‌ మైన్స్‌

రష్యాలో ఏం జరుగుతోంది?

For More International And Telugu News

Updated Date - Nov 26 , 2024 | 09:27 PM