Anwarul Azim: బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. రూ.5 కోట్ల కాంట్రాక్ట్ వెలుగులోకి!
ABN , Publish Date - May 23 , 2024 | 05:41 PM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్య కేసులో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఆయన హత్యకు రూ.5 కోట్ల మేర కాంట్రాక్ట్ కుదిరినట్లు...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బంగ్లాదేశ్ (Bangladesh) ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ (Anwarul Azim Anar) హత్య కేసులో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఆయన హత్యకు రూ.5 కోట్ల మేర కాంట్రాక్ట్ కుదిరినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని బెంగాల్ సీఐడీ తెలిపింది. మరో ట్విస్ట్ ఏమిటంటే.. అన్వరుల్ స్నేహితుడే సుపారీ ఇచ్చి, ఈ హత్య చేయించాడు. ఆయన పాత మిత్రుడే ఈ పని చేయించాడని, పక్కా పథకం ప్రకారమే ఈ హత్య జరిగిందని సీఐడీ వెల్లడించింది.
Read Also: ఆర్సీబీని విరాట్ కోహ్లీ వీడాలి.. అప్పుడే అది సాధ్యమవుతుంది
ఈ హత్య గురించి సీఐడీ ఐజీ అఖిలేష్ చతుర్వేది మాట్లాడుతూ.. ‘‘ఇది పథకం ప్రకారం జరిగిన హత్య. అన్వరుల్ పాత మిత్రుడే ఆయనను హత్య చేసేందుకు కాంట్రాక్ట్ కిల్లర్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. సుమారు రూ.5 కోట్ల వరకు సుపారీ ఇచ్చినట్లు తేలింది. అమెరికన్ పౌరసత్వం కలిగి ఉన్న ఆ వ్యక్తికి కోల్‌కతాలో ఒక ఫ్లాట్ ఉంది’’ అని చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకూ ముగ్గురు అనుమానుతుల్ని అరెస్ట్ చేశామని చెప్పారు. ‘మరి, హత్య చేయించిన అన్వరుల్ స్నేహితుడి ఫ్లాట్‌లో రక్తపు మరకలు కనుగొన్నారా?’ అనే ప్రశ్నకు బదులిస్తూ.. తమ ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలాన్ని ఇంకా పరిశీలిస్తోందని అఖిలేష్ పేర్కొన్నారు. ఈ కేసు గురించి ఇప్పుడప్పుడే మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు.
Read Also: భర్త కీచకపర్వం.. భార్య ప్రెండ్స్ అని కూడా చూడకుండా..
కాగా.. చికిత్స నిమిత్తం అన్వరుల్ మే 12వ తేదీన కోల్‌కతాకు వచ్చారు. బారానగర్‌లోని తన స్నేహితుడి ఇంట్లో బస చేశారు. అయితే.. మే 13న ఒకరిని కలవడానికి వెళ్లిన ఆయన మళ్లీ తిరిగి రాలేదు. ఆయన అదృశ్యంపై మే 18న ఎంపీకి పరిచయస్తుడైన గోపాల్ బిశ్వాస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో భాగంగా.. మే 13న ఆయన్ను గొంతుకోసి చంపారని, మృతదేహాన్ని ముక్కలు ముక్కలు నరికారని తేలింది. ఆ ముక్కల్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి.. మే 14, మే 15, మే 18 తేదీల్లో వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశారు. ఇప్పుడు ఆ ముక్కలు ఎక్కడి పారేశారో పోలీసులు వెతుకుతున్నారు.
Read Latest International News and Telugu News