Share News

China: మూడేళ్ల చిన్నారికి కఠిన శిక్ష.. ఏంటంటే..?

ABN , Publish Date - Jul 09 , 2024 | 05:23 PM

ఇప్పుడు ట్రెండ్ మారింది. పిల్లలకు సంబంధించి ఆట, పాటలు మారాయి. ఒకప్పటిలా నలుగురు కలిసి ఆడుకోవడం లేదు. అంతా మొబైల్ లేదంటే టీవీకి అతుక్కుపోతున్నారు. దాంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని పేరంట్స్ ఆందోళన చెందుతున్నారు. చైనాలో ఓ తండ్రి మూడేళ్ల చిన్నారి పట్ల కఠినంగా వ్యవహరించాడు.

China: మూడేళ్ల చిన్నారికి కఠిన శిక్ష.. ఏంటంటే..?
China Children

ఇప్పుడు ట్రెండ్ మారింది. పిల్లలకు సంబంధించి ఆట, పాటలు మారాయి. ఒకప్పటిలా నలుగురు కలిసి ఆడుకోవడం లేదు. అంతా మొబైల్ లేదంటే టీవీకి అతుక్కుపోతున్నారు. దాంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని పేరంట్స్ ఆందోళన చెందుతున్నారు. చైనాలో (China) ఓ తండ్రి మూడేళ్ల చిన్నారి పట్ల కఠినంగా వ్యవహరించాడు.


ఇదీ విషయం..

దక్షిణ చైనా గ్వాంగ్సీ జువాంగ్ అటానమస్ రీజియన్‌‌ యులిన్‌లో ఈ ఘటన జరిగింది. అక్కడ చిన్నారి జియాజియా ఫ్యామిలీ ఉంటోంది. మూడేళ్ల చిన్నారి పట్ల తండ్రి కఠినంగా ఉంటాడు. ఓ సారి డిన్నర్ చేద్దామని కూతురిని తండ్రి పిలిచాడు. ఆ చిన్నారి టీవీ చూస్తూ లీనమైపోయింది. తండ్రి మాటలను వినిపించుకోలేదు. కోపంతో ఊగిపోయిన తండ్రి ఆమె వద్దకు వచ్చాడు. టీవీ ఆఫ్ చేశాడు. దాంతో చిన్నారి ఏడవడం ప్రారంభించింది. సర్దిచెప్పాల్సింది పోయి.. మరింత కఠినంగా ప్రవర్తించాడు.


Modi-Putin: ఇదో వినాశకరమైన దెబ్బ.. మోదీ-పుతిన్ ఆలింగనంపై జెలెన్‌స్కీ ఫైర్


గిన్నె ఇచ్చి..

ఏడుస్తోన్న చిన్నారికి తండ్రి ఖాళీ గిన్నె అందించాడు. కన్నీటితో గిన్నె నింపాలని కోరాడు. ఆ గిన్నె నింపిన తర్వాతే టీవీ పెడతానని షరతు విధించాడు. టీవీ చూడాలనే ఆతృతతో నింపేందుకు ప్రయత్నించింది. ఏడుస్తూ.. కన్నీళ్లతో గిన్నెను నింపడం ఆమె వల్ల కాలేదు. పది సెకన్లు ట్రై చేసి ఊరుకుంది. ఏడుస్తోండగా చిన్నారి తల్లి వీడియో తీసింది. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంకేముంది తెగ వైరల్ అయ్యింది. చిన్నారి పట్ల తండ్రి ప్రవర్తనను నెటిజన్లు ఖండించారు. ఇలా చేయడం సరికాదని సూచించారు.


అంతలోనే కరిగి..!!

అక్కడే ఉన్న తండ్రి.. కన్నీళ్లతో గిన్నె నింపడం సాధ్యం కాదని తెలుసుకున్నాడు. వెంటనే నవ్వాలని చిన్నారిని చెప్పాు. కన్నీటితో నవ్వుతున్న చిన్నారిని ఫొటో తీశాడు. అప్పటివరకు కఠినంగా ఉన్న తండ్రి కరగడంతో చిన్నారి తల్లి కూడా సంతోషించింది.


Read Latest
International News and Telugu News

Updated Date - Jul 09 , 2024 | 05:23 PM