Share News

China: జస్ట్ నాలుగు నెలల్లో రూ.3 కోట్లు.. ఎలా సంపాదించాడంటే..?

ABN , Publish Date - Nov 01 , 2024 | 05:04 PM

చైనాలోని జిజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన వాంగ్.. వేల ఫోన్లను నకిలీ వీక్షకులతోపాటు లైవ్ స్ట్రీమ్‌లలో ట్రాఫిక్‌కు ఉపయోగించాడు. తద్వారా నాలుగు నెలల కంటే తక్కువ వ్యవధిలో రూ.3.4 కోట్లు సంపాదించాడు. దీంతో అతడు ప్రస్తుతం జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ కేసులో అతడికి 15 నెలల జైలు శిక్ష విధించడంతోపాటు రూ.7 వేల యూఎస్ డాలర్ల జరిమానా సైతం విధించారు. ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది.

China: జస్ట్ నాలుగు నెలల్లో రూ.3 కోట్లు.. ఎలా సంపాదించాడంటే..?

చైనాలోని ఓ వ్యక్తి వేల ఫోన్లను నకిలీ వీక్షకులతోపాటు లైవ్ స్ట్రీమ్‌లలో ట్రాఫిక్‌కు ఉపయోగించి నాలుగు నెలల వ్యవధిలో రూ.3.4 కోట్లు సంపాదించి జైలు పాలయ్యాడు. చైనాలోని జిజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన వాంగ్ ఈ తరహా నేరానికి పాల్పడ్డాడు. దీంతో అతడికి 15 నెలల జైలు శిక్ష విధించారు. అలాగే రూ. 7 వేల యూఎస్ డాలర్ల జరిమానా సైతం విధించారు. ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ శుక్రవారం వెల్లడించింది.

Also Read: Video Viral: ఉచిత గ్యాస్ పథకం ప్రారంభించి.. లబ్దిదారుడి ఇంట టీ పెట్టిన సీఎం చంద్రబాబు

Also Read: మెంతి కూర ఆకుతో ఇన్ని లాభాలా..?


లైవ్-స్ట్రీమ్ వీక్షకుల సంఖ్యను పెంచడానికి అతడు 4,600 ఫోన్‌లను వినియోగించాడని వివరించింది. తద్వారా నాలుగు నెలల్లోనే రూ.3.4 కోట్ల మేర వాంగ్ సంపాదించాడని పేర్కొంది. 2022 చివరలో ఈ వ్యాపారాన్ని అతడు ప్రారంభించాడని వివరించింది. వినియోగదారులను తప్పుదొవ పట్టించేందుకు ఈ తరహా వ్యవహారాన్ని వాంగ్ నడిపారని తెలిపింది. వ్యూవర్స్ సంఖ్య, లైక్స్, కామెంట్స్‌తోపాటు షేర్లు చేయడం వంటి వాటి వల్ల ప్రేక్షకులను వాంగ్ తప్పు దారి పట్టించారని చెప్పింది.

Also Read: Bengaluru: కారు ఆపలేదంటూ.. అద్దాలు పగలకొట్టి..

Also Read: TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం


ఈ స్కామ్ కోసం దాదాపు 4600 సెల్ ఫోన్ల ద్వారా ప్రత్యేక క్లౌడ్ టెక్నాలజీని వినియోగించి.. ఈ తరహా మోసానికి పాల్పడ్డారని పేర్కొంది. అందుకోసం రూటర్లు, స్విచ్‌లతోపాటు నెట్‌వర్క్ పరికరాలను సైతం అతడు కొనుగోలు చేశాడని వివరించింది. ఇక ఇందుకోసం వినియోగించే ఒక్కో సెల్ ఫోన్లకు ఒక్క యూఎస్ డాలర్ కంటే తక్కువ ఖర్చు అవుతుందని తెలిపింది.

Also Read: November: నవంబర్‌‌లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే..?

Also Read: పంజాబీ గాయకుడి నివాసంపై కాల్పులు.. వీడియో విడుదల చేసిన పోలీసులు


ఈ మొబైల్ ఫోన్‌లను వాంగ్ ఎక్కడి కొనుగోలు చేశాడనేది మాత్రం తెలియ రాలేదు. అయితే ఈ మొబైల్ ఫోన్ రీసైక్లింగ్ మార్కెట్‌లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వినియోగించే అవకాశముందని ప్రాసిక్యూటర్ సందేహం వ్యక్తం చేశారు. ఈ కేసులో వాంగ్‌తోపాటు మరో 17 మంది అనుమానితులపై విచారణ జరుగుతుంది. ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది.

For International News And Telugu News

Updated Date - Nov 01 , 2024 | 05:05 PM