Elon Musk: ఎక్స్‌ను అణచివేసే కుట్ర.. కమలాపై ఎలాన్ మస్క్ సంచలనం
ABN , Publish Date - Oct 23 , 2024 | 05:23 PM
సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్ ఫాం 'ఎక్స్'(గతంలో ట్విటర్)ను అణచివేయడానికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ బృందం కుట్ర పన్నుతోందా. అంటే అవుననే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్ ఫాం 'ఎక్స్'(గతంలో ట్విటర్)ను అణచివేయడానికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ బృందం కుట్ర పన్నుతోందా. అంటే అవుననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమలా హారిస్ బృందంలో ఇంగ్లాండ్‌కు చెందిన పొలిటికల్ ఆపరేటివ్ మోర్గాన్ మెక్ స్వీనీ ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, మోర్గాన్ మెక్ స్వీనీ ‘సెంటర్ ఫర్ కౌంటరింగ్ డిజిటల్ హేట్’ అనే సంస్థను నడిపిస్తున్నారు. ఇంగ్లాండ్ ప్రధాని స్ట్రీమర్ కు చెందిన లేబర్ పార్టీతో ఆ కంపెనీకు సత్సంబంధాలు ఉన్నాయి. అయితే తాజాగా సీసీడీహెచ్ సంస్థకు సంబంధించిన కొన్ని పత్రాలను ది డిస్‌ఇన్ఫర్మేషన్ క్రానికల్ అనే సంస్థ బయటపెట్టింది. 2024లో రూపొందించిన డాక్యుమెంట్లలో ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ఎక్స్ ను అణచివేయడం ఎలా అనే దానిపై స్పష్టంగా పేర్కొంది.
‘కిల్ మస్క్స్ ట్విటర్’ పేరుతో ఇది ఉంది. ఎక్స్‌ను ఆర్థికంగా దెబ్బతీయడం, ప్రకటనలు ఇచ్చేవారిని భయపెట్టడం వంటి సంచలన విషయాలు ఉన్నాయి. కమలా బృందం చేస్తున్న పనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ఈ ఘటన అమెరికాలో క్రిమినల్ చట్టాలను ఉల్లంఘిస్తూ ఎన్నికల్లో జోక్యం చేసుకొనేలా ఉందని, సీసీడీహెచ్ దాని దాతలపై పోరాడతామని చెప్పారు. రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల తర్వాత ఎలాన్ మస్క్ ఆయనకు అండగా నిలిచిన విషయం తెలిసిందే. ట్రంప్‌ను ఉద్దేశించి మస్క్ ఓ కార్యక్రమంలో కూడా ప్రసంగించారు.
వారానికి 100 గంటల పని..
పని ఒత్తిడి, అధిక పని గంటలతో శారీరకంగా, మానసికంగా కుంగిపోయి ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో వారానికి 100 గంటలు పని చేస్తేనే వేగంగా విజయాన్ని పొందొచ్చని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. 'మీరు వారానికి 100 గంటలు పనిచేస్తే ఇతరులు 50 గంటలు పనిచేసిన దానికంటే రెట్టింపు ఫలితం సాధిస్తారు. నేను, నా సోదరుడు రాత్రుళ్లు కోడింగ్ చేసేవాళ్లం' అని తెలిపారు.
దేశం అభివృద్ధి చెందాలంటే యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని ఇన్ఫోసిస్ సీఈవో నారాయణ మూర్తి అప్పట్లో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. పని గంటలను పరిస్థితులకు తగ్గట్టు సవరించుకోకపోతే అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడలేమని అభిప్రాయపడ్డారు. ‘దేశ యువతను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా దేశం. నా దేశం కోసం వారానికి 70 గంటల పాటు పని చేసేందుకు నేను సిద్ధం అంటూ యువత కూడా నాతో పాటు ముందుకు రావాలి’’ అని నారాయణ మూర్తి పిలుపునిచ్చారు. ఈ కామెంట్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
Diwali 2024: దీపావళి ఏ రోజు? అక్టోబర్ 31 లేదా నవంబర్ 1?
For Latest News and National News Click here