Share News

Mudslides: విరిగిపడిన కొండచరియలు.. 157 మంది మృతి

ABN , Publish Date - Jul 23 , 2024 | 04:41 PM

ఆఫ్రికా దేశమైన ఇథియోపియా(Ethiopia)లో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 157 మంది మృత్యువాత పడ్డారు. దక్షిణ ఇథియోపియాలోని కెంచో షాచా గోజ్డి జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

Mudslides: విరిగిపడిన కొండచరియలు.. 157 మంది మృతి
Ethiopia

ఆఫ్రికా దేశమైన ఇథియోపియా(Ethiopia)లో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 157 మంది మృత్యువాత పడ్డారు. దక్షిణ ఇథియోపియాలోని కెంచో షాచా గోజ్డి జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వర్షం నుంచి వచ్చిన బురద(Mudslides) కారణంగా మృతి చెందిన వారిలో చిన్నారులు, గర్భిణులు కూడా ఉన్నారని స్థానిక నిర్వాహకుడు దగ్మావి అయేలే తెలిపారు. ఒక రోజు ముందు మరో కొండచరియలు విరిగిపడటంతో రెస్క్యూ సిబ్బంది బాధితుల కోసం వెతకగా, సోమవారం ఉదయం కూడా కొండచరియలు విరిగిపడటంతో చాలా మంది ప్రజలు సమాధి అయ్యారని అన్నారు.


సర్వసాధారణం

శిథిలాల నుంచి ఐదుగురిని సజీవంగా బయటకు తీశామని అయెలే తెలిపారు. ప్రమాదంలో తల్లి, తండ్రి, సోదరుడు, సోదరితో సహా మొత్తం కుటుంబాన్ని కోల్పోయిన చాలా మంది పిల్లలు ఉన్నారు. సెర్చ్ ఆపరేషన్లలో మరణించిన వారి సంఖ్య సోమవారం 55 నుంచి మంగళవారం నాటికి 157కు పెరిగిందన్నారు. అయితే జులైలో ప్రారంభమయ్యే వర్షాకాలంలో ఇథియోపియాలో కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణంగా మారింది. ఈ వర్షాకాలం సెప్టెంబర్ మధ్య వరకు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అక్కడి అధికారులు చెబుతున్నారు.


యంత్రాలు కూడా

ప్రమాదం నేపథ్యంలో మట్టిలో కూరుకుపోయిన మృతదేహాలు చాలా ఉన్నాయని, వాటిని బయటకు తీయలేకపోయామని చెబుతున్నారు. ఈ మృతదేహాల కోసం గాలిస్తున్నామని రెస్క్యూ సిబ్బంది చెప్పారు. మట్టిని తొలగించే యంత్రాలు వారి దగ్గర లేనందు వల్ల ఎర్రమట్టిని తమ చేతులతో తవ్వుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతం గోఫా రాజధాని అడిస్ అబాబా నుంచి 320 కి.మీ. దూరంలో ఉంది. ఒక కొండచరియ తర్వాత మరో కొండచరియ కూడా విరిగిపడటంతో ప్రమాదం తీవ్రత పెరిగిందని అక్కడి పోలీసులు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

Budget 2024: కస్టమ్ డ్యూటీ తగ్గింపు.. తగ్గనున్న మొబైల్ ఫోన్స్, బంగారం, ప్లాటినం ధరలు


8 ఐపీఓలు.. 8 లిస్టింగ్‌లు

Read More international News and Latest Telugu News

Updated Date - Jul 23 , 2024 | 05:21 PM