Share News

Dhruvi Patel: మిస్ ఇండియా వరల్డ్ వైడ్‌-2024 విజేత.. ధృవీ పటేల్

ABN , Publish Date - Sep 20 , 2024 | 08:07 AM

అమెరికాకు చెందిన ధృవీ పటేల్ మిస్ ఇండియా వరల్డ్ వైడ్‌-2024 విజేతగా నిలిచారు. న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ఆమెకు నిర్వాహాకులు మిస్ ఇండియా వరల్డ్ వైడ్‌-2024 కిరీటం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ధృవీ పటేల్ మాట్లాడుతూ.. ఈ పోటీల్లో విజేతగా నిలవడం సంతోషంగా ఉందన్నారు.

Dhruvi Patel: మిస్ ఇండియా వరల్డ్ వైడ్‌-2024 విజేత.. ధృవీ పటేల్
Dhruvi Patel

వాషింగ్టన్, సెప్టెంబర్ 20: అమెరికాకు చెందిన ధృవీ పటేల్ మిస్ ఇండియా వరల్డ్ వైడ్‌-2024 విజేతగా నిలిచారు. న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ఆమెకు నిర్వాహాకులు మిస్ ఇండియా వరల్డ్ వైడ్‌-2024 కిరీటం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ధృవీ పటేల్ మాట్లాడుతూ.. ఈ పోటీల్లో విజేతగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఇది అపురూపమైన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.


ఈ కిరీటం కంటే గౌరవం తన మనస్సుకు మరింత ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందన్నారు. ‘‘ఇది నా సంస్కృతిని, నా విలువలకు సంకేతం. నాకు దక్కిన ఈ పురస్కారం ప్రపంచ స్థాయిలో ఇతరులను సైతం ప్రేరేపించే అవకాశముంది. బాలీవుడ్‌లో యాక్టర్ కావాలని నేను కలలు కంటున్నాను. అలాగే యూనిసెఫ్ అంబాసిడర్‌‌గా ఉండాలని అనుకుంటున్నాను’’ అని ఆమె చెప్పారు.


ధృవీ పటేల్ ప్రస్తుతం యూఎస్‌లో కంప్యూటర్స్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్‌‌ అభ్యసిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా భారత్ వెలుపల ఈ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో సురినామ్‌కు చెందిన లిసా అబ్డోయెల్హాక్ ఫస్ట్ రన్నరప్‌గా.. నెదర్లాండ్స్‌కు చెందిన మాళవిక శర్మ రెండో రన్నరప్‌గా నిలిచారు.


ఇక ఈ పోటీల్లో మిసెస్ కేటగిరిలో ట్రినిడాడ్ టుబాగోకు చెందిన సుఅన్ మౌటీ విజేతగా నిలువగా, బ్రిటన్‌కు చెందిన స్నేహ నాంబియార్, పవన్ దీప్ కౌర్ మొదటి, రెండో రన్నరప్‌లుగా నిలిచారు. అలాగే టీనేజ్ కేటగిరిలో గ్వాడెలోప్‌కు చెందిన సియేర్రా సురెట్ మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్‌గా నిలిచారు.


న్యూయార్క్‌కు చెందిన ఇండియా ఫెస్టివల్ కమిటీ ప్రతి ఏటా ఈ మిస్ ఇండియా వరల్డ్ వైడ్‌ పోటీలను నిర్వహిస్తున్న విషయం విధితమే. ఇండియన్ అమెరికన్స్ నీలం, ధర్మాత్మ శరణ్‌లు ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. గత మూడు దశాబ్దాలుగా మిస్ ఇండియా వరల్డ్ వైడ్‌ పోటీలు వారు నిర్వహిస్తున్నారు.

For More International News and Telugu News కొరకు..

Updated Date - Sep 20 , 2024 | 08:18 AM