Earthquake: 7.3 తీవ్రతతో వణికించిన భూకంపం.. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం?
ABN , Publish Date - Jul 19 , 2024 | 10:18 AM
చిలీ(Chile) దేశాన్ని భూకంపం వణికించింది. ఆ దేశ ఉత్తర తీర ప్రాంతాన్ని భూకంపం తాకింది. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం నమోదవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ముందుగానే సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
శాంటియాగో: చిలీ(Chile) దేశాన్ని భూకంపం వణికించింది. ఆ దేశ ఉత్తర తీర ప్రాంతాన్ని భూకంపం తాకింది. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం నమోదవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ముందుగానే సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
తైవాన్ రాజధాని శాంటియాగోకు ఉత్తరాన అర్జెంటీనా- బొలీవియా సరిహద్దుల్లో ఉన్న శాన్ పెడ్రో డీ అటకామా ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. అటకామాకు ఈశాన్య దిక్కున 41 కిలోమీటర్ల దూరంలో.. చిలీ కాలమానం ప్రకారం గురువారం రాత్రి 9:50 నిమిషాలకు భూమి కంపించినట్లు తేలింది. భూఉపరితలం నుంచి 12 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో కదలికల వల్ల భూమి కంపించింది.
భూకంప కేంద్రానికి 265 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతిపెద్ద తీర ప్రాంత నగరం ఆంటోఫొగస్టాలో భవనాలు బీటలు వారాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. భూకంపానికి సంబంధించిన వీడియోలు నెట్టింట్ వైరల్‌గా మారాయి. భూకంపం ధాటికి తీర ప్రాంతం భీకరంగా కనిపించింది. అలలు సాధారణం కంటే ఎక్కువ ఎత్తుకు ఎగిసిపడ్డాయి.
అధికారులు అప్రమత్తమై తీర ప్రాంత ప్రజలను ఖాళీ చేయించారు. భూకంపం ధాటికి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే చిలీలో ఇది వరకే చాలా సార్లు భూకంపాలు వచ్చాయి. చిలీ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఉంది. చిలీ సహా ఇండొనేసియా, న్యూజిలాండ్, కోస్టారికా, గ్వాటెమాల, మెక్సికో, అమెరికా, కెనడా, బొలీవియా, ఈక్వెడార్, పెరూ,రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, అంటార్కిటికాలు రింగ్ ఆఫ్ ఫైర్ లిస్టులో ఉన్నాయి.
గతంలో..
2010లో చిలీలో 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. ఈ భూకంపం సముద్రంలో రావడంతో సునామీ అలలు 526 మందిని బలితీసుకున్నాయి.
1960లో దక్షిణ చిలీ నగరం వాల్డివియాలో 9.5 తీవ్రతతో సంభవించి అనేక మంది ప్రాణాలను బలికొంది.
1965 - లా లిగువాలో 7.4 తీవ్రతతో భూకంపం, 400 మంది మృతి చెందారు.
1971 - వల్పరైసో ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించగా 90 మంది మరణించారు.
1985 - వల్పరైసో తీరంలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించగా, 177 మంది చనిపోయారు.
1998 - ఉత్తర చిలీ తీరానికి సమీపంలో 7.1 తీవ్రత
2002 - చిలీ, అర్జెంటీనా సరిహద్దు ప్రాంతంలో 6.6 తీవ్రత
2003 - సెంట్రల్ చిలీ తీరానికి సమీపంలో 6.8 తీవ్రత
2004 - సెంట్రల్ చిలీలో బయో సమీపంలో 6.6 తీవ్రతతో..
2005 - తారాపకాలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించగా 11 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.
2007 - ఉత్తర చిలీలోని ఆంటోఫాగస్టాలో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం, ఇద్దరు మృతి చెందారు.
2007 - ఆంటోఫాగస్టాలో 6.7 తీవ్రత
2008 - తారాపకాలో 6.3 తీవత్రతో భూకంపం
2009 - తారాపకా తీరంలోనే 6.5 తీవ్రతతో మరో భూకంపం. ఈ ఘటనల్లో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
For Latest News and National News click here