Elon Musk: 2032లో అమెరికా ఎన్నికల్లో ఏఐ కీలక భూమిక.. ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 15 , 2024 | 08:05 AM
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో ఏఐ(AI) టెక్నాలజీ అనేక రంగాలను ప్రభావితం చేస్తోంది. దీని ప్రభావం ప్రధానంగా సాఫ్ట్‌వేర్ రంగంపై పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
న్యూయార్క్: సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో ఏఐ(AI) టెక్నాలజీ అనేక రంగాలను ప్రభావితం చేస్తోంది. దీని ప్రభావం ప్రధానంగా సాఫ్ట్‌వేర్ రంగంపై పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సైతం ఏఐ భవిష్యత్తులో ప్రభావం చూపుతుందని స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) పేర్కొన్నారు. ఫండమెంటల్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, లైఫ్ సైన్సెస్‌లో పురోగతి సాధించినందుకు ప్రపంచంలోనే అతిపెద్ద సైన్స్ అవార్డు అయిన 10వ వార్షిక బ్రేక్‌త్రూ ప్రైజ్ వేడుకలో మస్క్ శనివారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2032లో జరిగే US అధ్యక్ష ఎన్నికలకు కృత్రిమ మేధస్సు (AI) నాయకత్వం వహిస్తుందని పేర్కొన్నారు. 2024 యూఎస్ ఎన్నికల్లో విజేతగా ఎవరు నిలుస్తారని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులుగా.. 2032 ఎన్నికల్లో మాత్రం వైట్‌హౌస్‌కు ట్రాన్స్‌ఫార్మర్లు, ఏఐ నాయకత్వం వహిస్తాయని మస్క్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. 2026 నాటికి AI మానవుల కంటే తెలివిగా మారుతుందని అంచనా వేశారు. ఏఐ మానవులకంటే అత్యంత తెలివైనదని.. అది ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కవచ్చని చెప్పారు.
ఈ వేడుకకి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హాజరయ్యారు. బ్రేక్‌త్రూ ప్రైజ్‌ను 2012లో సెర్గీ బ్రిన్ (గూగుల్ సహ వ్యవస్థాపకుడు), మార్క్ జుకర్‌బర్గ్ (ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు), ప్రిసిల్లా చాన్ (చాన్ జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్ సహ వ్యవస్థాపకుడు), జూలియా, యూరి మిల్నర్ స్థాపించారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి