Fire Accident: నైట్‌క్లబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 29 మంది మృతి, పలువురికి గాయాలు
ABN , Publish Date - Apr 03 , 2024 | 07:14 AM
టర్కీ(turkey)లోని ఇస్తాంబుల్(Istanbul)లో ఘోర అగ్ని ప్రమాదం(Fire accident) జరిగింది. ఇక్కడి ఓ నైట్ క్లబ్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఇప్పటి వరకు 29 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరికొంత మంది గాయపడ్డారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.
టర్కీ(turkey)లోని ఇస్తాంబుల్(Istanbul)లో ఘోర అగ్ని ప్రమాదం(Fire accident) జరిగింది. ఇక్కడి ఓ నైట్ క్లబ్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఇప్పటి వరకు 29 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరికొంత మంది గాయపడ్డారు. భూగర్భ మాస్క్వెరేడ్ నైట్‌క్లబ్(Masquerade nightclub)లో పగటిపూట పునరుద్ధరణ పనుల సమయంలో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగిందని అక్కడి అధికారులు చెబుతున్నారు.
వెంటనే సమాచారం అందుకున్న సిబ్బంది రంగంలోకి దిగి ఆ భవనం పైన నివసిస్తున్న డజన్ల కొద్దీ నివాసితులను ఖాళీ చేయించారు. 16 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో ఇతర ఫోర్లకు కూడా పెద్ద ఎత్తున మంటలు, పొగ వ్యాపించాయి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: S Jaishankar: భారత్‌కు శాశ్వత స్థానం దక్కాలంటే.. ఆ పని చేయాల్సి ఉంటుంది
ఈ నైట్‌క్లబ్(Masquerade nightclub) గరెటెప్ జిల్లాలో ఉన్న 16 అంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో నిర్మించబడింది. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టిన అధికారులు ఇప్పటి వరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయని, అగ్నిమాపక దళం దానిని ఆర్పడానికి చాలా సమయం పట్టిందని పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియనప్పటికీ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. నైట్‌క్లబ్‌లో పునరుద్ధరణ పనులు(during renovations) జరుగుతున్న క్రమంలో మంటలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో క్లబ్‌లో భారీగా మంటలు చెలరేగాయని వెల్లడించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Earthquake: 7.5 తీవ్రతతో తీవ్ర భూకంపం..హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం