Share News

జనవరి 1 నుంచి స్విట్జర్లాండ్‌లో బురఖాపై నిషేధం

ABN , Publish Date - Nov 10 , 2024 | 02:49 AM

స్విట్జర్లాండ్‌లో బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడంపై నిషేధం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.

జనవరి 1 నుంచి స్విట్జర్లాండ్‌లో బురఖాపై నిషేధం

  • బహిరంగ ప్రదేశాల్లో అమలు

  • ఉల్లంఘిస్తే వెయ్యి స్విస్‌ ఫ్రాంక్‌ల జరిమానా

  • ముస్లిం సంస్థలు, హక్కుల కార్యకర్తల వ్యతిరేకత

న్యూఢిల్లీ, నవంబరు 9: స్విట్జర్లాండ్‌లో బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడంపై నిషేధం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రజలు తిరిగే ప్రైవేటు భవనాల్లోనూ బురఖాపై నిషేధం ఉంటుంది. ఈ నిబంధనలను అతిక్రమించిన వారికి 1,000 స్విస్‌ ఫ్రాంక్‌ల (రూ.96,947) జరిమానా విధించనున్నారు. ఈ నిర్ణయాన్ని ముస్లిం సంస్థలు, హక్కుల కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2021లో దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో బురఖా నిషేధానికి మద్దతుగా 51 శాతం మంది ప్రజలు ఓటేశారు. అక్కడి పార్లమెంట్‌లోనూ ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది. దాదాపు 88.5 లక్షల మంది జనాభా ఉన్న స్విట్జర్లాండ్‌లో.. ముస్లింలు 5 శాతం ఉన్నారు.

Updated Date - Nov 10 , 2024 | 02:49 AM