Share News

Missile Attack: క్షిపణి దాడి నుంచి తృటిలో తప్పించుకున్న రెండు దేశాల నేతలు.. జస్ట్ మిస్

ABN , Publish Date - Mar 07 , 2024 | 01:15 PM

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం(ukraine russia war) మొదలై గత నెల నాటికి రెండు సంవత్సరాలు పూర్తైంది. కానీ ఈ దేశాల మధ్య శాంతి నెలకొనలేదు. ఈ నేపథ్యంలోనే ఇటివల రష్యా క్షిపణి మరోసారి దాడి(missile attack) చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.

Missile Attack: క్షిపణి దాడి నుంచి తృటిలో తప్పించుకున్న రెండు దేశాల నేతలు.. జస్ట్ మిస్

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం(ukraine russia war) మొదలై గత నెల నాటికి రెండు సంవత్సరాలు పూర్తైంది. అయినా కూడా పలు దేశాల నేతలు ప్రయత్నాలు చేసినా కూడా ఇప్పటి వరకు ఈ దేశాల మధ్య శాంతి నెలకొనలేదు. ఇప్పటికీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఉక్రేనియన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Zelensky), గ్రీస్ ప్రధాన మంత్రి కిరియాకోస్‌(Kyriakos Mitsotakis)ను కలిసేందుకు వెళ్లిన సమయంలో మరో ఎటాక్ జరిగింది. అయితే అతని కాన్వాయ్ అతి సమీపంలోనే రష్యా క్షిపణిచే దాడి(missile attack) జరుగగా ఇద్దరు దేశాల నేతలు తృటిలో తప్పించుకున్నారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గ్రీక్ ఎంబసీకి చేరుకున్నప్పుడు 100 మీటర్ల దూరంలో రష్యన్ క్షిపణి దాడి(russian missile attack) జరిగిందని తెలుస్తోంది. ఆ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వల్పంగా తప్పించుకున్నట్లు చెబుతున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత జలెన్స్కీకి అతి సమీపంలో క్షిపణి దాడి జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.


ఈ ఘటన చాలా నష్టాన్ని కలిగించిందని తనకు తెలుసని జెలెన్స్కీ(Zelensky) ఈ ఘటన తర్వాత అన్నారు. తన దగ్గర ఇంకా అన్ని వివరాలు లేవని, కానీ చాలా మంది మరణించారని వెల్లడించారు. మనం ముందుగా మనల్ని మనం రక్షించుకోవాలని అన్నారు. దానికి ఉత్తమ మార్గం బలమైన వాయు రక్షణ వ్యవస్థను కల్గి ఉండటమేనని చెప్పారు. అంతేకాదు రష్యా ఇంతకుముందు కూడా చాలాసార్లు ఒడెస్సాను లక్ష్యంగా చేసుకుంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Viral Video: సచిన్ టెండూల్కర్‌ను చిత్తుగా ఔట్ చేసిన యువ బౌలర్

Updated Date - Mar 07 , 2024 | 01:15 PM