Share News

Heavy Floods: పొరుగు దేశంలో భారీ వరదలు..47 మంది మృతి, పలువురు గల్లంతు

ABN , Publish Date - May 19 , 2024 | 06:58 PM

ఆఫ్ఘనిస్థాన్‌(Afghanistan)లో మళ్లీ వరదలు(floods) బీభత్సం సృష్టించాయి. దీంతో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఉత్తర ఆఫ్ఘనిస్థాన్‌లో ఇటీవల భారీ వర్షాల(rains) కారణంగా ఘోర్, ఫర్యాబ్ ప్రావిన్స్‌లలో భారీగా వరదలు సంభవించాయి. దీంతో 47 మందికిపైగా మృత్యువాత చెందారు.

Heavy Floods: పొరుగు దేశంలో భారీ వరదలు..47 మంది మృతి, పలువురు గల్లంతు
Heavy rain floods in northern Afghanistan

ఆఫ్ఘనిస్థాన్‌(Afghanistan)లో మళ్లీ వరదలు(floods) బీభత్సం సృష్టించాయి. దీంతో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఉత్తర ఆఫ్ఘనిస్థాన్‌లో ఇటీవల భారీ వర్షాల(rains) కారణంగా ఘోర్, ఫర్యాబ్ ప్రావిన్స్‌లలో భారీగా వరదలు సంభవించాయి. దీంతో 47 మందికిపైగా మృత్యువాత చెందారు. మే 19న ఆఫ్ఘనిస్తాన్‌లోని స్థానిక అధికారులు ఈ మేరకు ధృవీకరించారు. మే 17 నుంచి ఘోర్ ప్రావిన్స్‌లో మరణించిన వారి సంఖ్య 55కి చేరుకుంది. అయితే ఫర్యాబ్ ప్రావిన్స్‌లో మే 18న 18 మంది ప్రాణాలు కోల్పోగా, రాత్రి సమయంలో అదనంగా 47 మంది మరణించారు. మార్చి చివరి నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లోని వివిధ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.


మరోవైపు ఘోర్ ప్రావిన్స్‌లో కుండపోత వర్షాల(rains) కారణంగా సంభవించిన వరదలలో సుమారు 68 మంది మరణించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో పదుల సంఖ్యలో ప్రజలు వరదల్లో గల్లంతైనట్లు సమాచారం. ఇంకా డజన్ల కొద్దీ ప్రజలు కనిపించకుండా పోయారని ఘోర్ గవర్నర్ అధికార ప్రతినిధి అబ్దుల్ వాహిద్ హమాస్ తెలిపారు. వరదల కారణంగా వేల సంఖ్యలో ఇళ్లు, ఆస్తులు దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. వందలాది ఎకరాల పొలం నాశనమైందని వెల్లడించారు. ఈ వరద బీభత్సం కిలోమీటర్ల మేర వ్యాపించిందని తెలిపారు.


ఇంకోవైపు ఏప్రిల్‌లో వచ్చిన వరదల(floods) కారణంగా దాదాపు 70 మంది మరణించగా, అప్పుడు పశ్చిమ ఫరా, హెరాత్, దక్షిణ జబుల్, కాందహార్ ప్రావిన్సులలో దాదాపు 2,000 గృహాలు, మూడు మసీదులు, నాలుగు పాఠశాలలు ధ్వంసమయ్యాయి.


ఇది కూడా చదవండి:

EPFO: మీరు ఏ వయస్సులో ముందస్తు పెన్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు?


Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త

Read Latest International News and Telugu News

Updated Date - May 19 , 2024 | 07:00 PM