Share News

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువుల భారీ ర్యాలీ.. ప్రభుత్వం ముందు 8 డిమాండ్లు

ABN , Publish Date - Oct 26 , 2024 | 07:44 PM

హిందూ కమ్యూనిటీ డిమాండ్లను తాము తెలుసుకున్నామని, వారికి హామీగా దుర్గాపూజకు రెండు సెలవు దినాలను ప్రకటించామని బంగ్లాదేశ్ పర్యావరణ మంత్రి సైయద్ రిజ్వాన హసన్ తెలిపారు. బంగ్లాదేశ్ చరిత్రలోనే రెండ్రోజుల సెలవు ప్రకటించడం ఇదే మొదటిసారని అన్నారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువుల భారీ ర్యాలీ.. ప్రభుత్వం ముందు 8 డిమాండ్లు

ఢాకా: బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వంలో మైనారిటీల హక్కులు, భద్రతపై పెద్దఎత్తున హిందూ మైనారిటీలు ఆందోళనకు దిగారు. సనాతన జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో చారిత్రక లాల్‌డిఘి మైదానంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాదిమందితో ర్యాలీ జనసంద్రమైంది. మమ్మద్ యూనస్ సారథ్యంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం తమ 8 డిమాండ్లను నెరవేర్చేంత వరకూ తాము వెనుదిరిగేది లేదని హిందూ ఉద్యమకారులు తెలిపారు.

తప్పుడు కేసు పెట్టి.. నిర్బంధించి..


డిమాండ్లివే..

-మైనారిటీలపై దాడులతో ప్రమేయం ఉన్న వారిపై చర్యలను వేగవంతం చేసేందుకు ట్రిబ్యునల్ ఏర్పాటు

-దాడుల బాధితులకు పరిహారం, పునరావసం కల్పించడం.

-తక్షణం మైనారిటీల పరిరక్షణ చట్టం తీసుకురావడం.

-మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు.

-విద్యా సంస్థలు, హాస్టళ్లలో మైనారిటీలు ప్రార్థనలు చేసుకునేందుకు ఆరాధనా స్థలాలు, ప్రేయర్ రూమ్‌లు నిర్మించాలి.

-హిందూ బుద్ధిస్ట్, క్రిస్టియన్ వెల్ఫేర్ ట్రస్టులకు చేయూత

-ప్రాపర్టీ రికవరీ అండ్ ప్రిజర్వేషన్ యాక్ట్, ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఎన్‌ట్రస్టెడ్ ప్రాపర్టీ యాక్ట్‌ను సక్రమంగా అమలు చేయడం.

-సంస్కృతి, పాలి ఎడ్యుకేషన్ బోర్డును ఆధునీకరించడం, దుర్గాపూజకు 5 రోజుల సెలవుదినాలు ప్రకటించడం.


సానుకూలమే..

హిందూ కమ్యూనిటీ డిమాండ్లను తాము తెలుసుకున్నామని, వారికి హామీగా దుర్గాపూజకు రెండు సెలవు దినాలను ప్రకటించామని బంగ్లాదేశ్ పర్యావరణ మంత్రి సైయద్ రిజ్వాన హసన్ తెలిపారు. బంగ్లాదేశ్ చరిత్రలోనే రెండ్రోజుల సెలవు ప్రకటించడం ఇదే మొదటిసారని అన్నారు.


కాగా, గత ఆగస్టు 5న షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత మైనారిటీలపై భౌతికదాడులు, లూటీలు, విధ్వంసకాండలు చోటుచేసుకున్నాయి. మైనారిటీల హక్కులకు భంగం కలగనీయమని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఈ తరహా ఘటనలు ఆగడం లేదు. ఈక్రమంలో బంగ్లాలో వేలాది మంది హిందువులు సంఘటితంగా భారీ ప్రదర్శన జరపడం ఇదే మొదటిసారి.


ఇది కూడా చదవండి..

28లోగా రాజీనామా చెయ్యాల్సిందే

Read More International News and Latest Telugu News

Updated Date - Oct 26 , 2024 | 07:44 PM