Share News

వందల మంది అమెరికన్లకు న్యాయం: బైడెన్‌

ABN , Publish Date - Sep 29 , 2024 | 04:38 AM

నస్రల్లా మరణంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ స్పందించారు. నాలుగు దశాబ్దాల్లో వందల మంది అమెరికన్లను హిజ్బుల్లా పొట్టనబెట్టుకుందని, నస్రల్లా మరణంతో ఆ కుటుంబాలకు ‘న్యాయం జరిగింది’ అని వ్యాఖ్యానించారు.

వందల మంది అమెరికన్లకు న్యాయం: బైడెన్‌

వాషింగ్టన్‌: నస్రల్లా మరణంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ స్పందించారు. నాలుగు దశాబ్దాల్లో వందల మంది అమెరికన్లను హిజ్బుల్లా పొట్టనబెట్టుకుందని, నస్రల్లా మరణంతో ఆ కుటుంబాలకు ‘న్యాయం జరిగింది’ అని వ్యాఖ్యానించారు. నస్రల్లాను హతమార్చడం సరైందేనని పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థల నుంచి తనను తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని, అమెరికా పూర్తి మద్దతిస్తుందని అన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి శుక్రవారమే తాను తన కార్యదర్శితో అమెరికా బలగాలను మోహరించాలని ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. చర్చల ద్వారానే గాజా, లెబనాన్‌లో ఉద్రిక్తతలను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. కాగా.. బీరుట్‌లోని తమ ఎంబసీ ఉద్యోగులు కుటుంబాలతో సహా లెబనాన్‌ను విడిచిపెట్టాలని అమెరికా హెచ్చరించింది. తమ పౌరులెవరూ లెబనాన్‌ వెళ్లకూడదంటూ ‘ట్రావెల్‌ అలెర్ట్‌’ జారీ చేసింది.

Updated Date - Sep 29 , 2024 | 04:38 AM