Landslides: విరిగిపడిన కొండచరియలు.. 670 మందికి పైగా మృతి
ABN , Publish Date - May 26 , 2024 | 07:30 PM
పపువా న్యూ గినియా(Papua New Guinea)లో దారుణం జరిగింది. కొండచరియలు(Landslides) విరిగిపడటంతో 670 మంది చనిపోయారని అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) ఆదివారం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో విరిగిపడిన శిథిలాల నుంచి అత్యవసర బృందాలు మృతదేహాలను(deaths) బయటకు తీస్తున్నాయి.
పపువా న్యూ గినియా(Papua New Guinea)లో దారుణం జరిగింది. కొండచరియలు(Landslides) విరిగిపడటంతో 670 మంది చనిపోయారని అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) ఆదివారం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో విరిగిపడిన శిథిలాల నుంచి అత్యవసర బృందాలు మృతదేహాలను(deaths) బయటకు తీస్తున్నాయి. ఈ విపత్తు నుంచి మరణించిన వారి సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. కొండచరియలు విరిగిపడటంతో 150కి పైగా ఇళ్లు సమాధి అయ్యాయని అక్కడి స్థానికులు తెలిపారు.
యాంబాలి గ్రామం, ఎంగా ప్రావిన్షియల్ అధికారుల లెక్కల ఆధారంగా సవరించిన మరణాల సంఖ్య మరింత పెరుగుతుందని అన్నారు. ప్రస్తుతం పపువా న్యూ గినియాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. రెస్క్యూ సిబ్బంది క్షతగాత్రులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దేశ రాజధాని పోర్ట్ మోర్స్బీకి వాయువ్యంగా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంగా ప్రావిన్స్‌లో శుక్రవారం కొండచరియలు విరిగిపడటంతో అనేక మంది ప్రజలు సమాధి అయ్యారు.
ఇది కూడా చదవండి:
EPFO: మీరు ఏ వయస్సులో ముందస్తు పెన్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు?
Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త
Read Latest International News and Telugu News