Share News

Elon Musk:ట్రంప్ ఆఫర్‌పై స్పందించిన ఎలాన్ మస్క్.. రిఫ్లై అదిరిందిగా..

ABN , Publish Date - Aug 20 , 2024 | 11:43 AM

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు కేబినెట్‌లో అవకాశం కల్పిస్తానని.. అలా కుదరకపోతే కనీసం సలహాదారుడిగా నియమించుకుంటానని ప్రకటించారు.

Elon Musk:ట్రంప్ ఆఫర్‌పై స్పందించిన ఎలాన్ మస్క్.. రిఫ్లై అదిరిందిగా..
Trump and Musk

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు కేబినెట్‌లో అవకాశం కల్పిస్తానని.. అలా కుదరకపోతే కనీసం సలహాదారుడిగా నియమించుకుంటానని ప్రకటించారు. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్షుడి పదవికి డొనాల్డ్ ట్రంప్ పోటీపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ ఎలాన్ మస్క్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. మస్క్ ఎంతో తెలివైన వ్యక్తి అంటూ కొనియాడారు. అలాగే విద్యుత్తు వాహనాలపై 5,500 డాలర్ల క్రెడిట్‌ను రద్దు చేసే విషయాన్ని పరిశీలిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. ట్యాక్స్ క్రెడిట్‌లు, పన్ను ప్రోత్సాహకాలు ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చువి కాదని తన అభిప్రాయంగా ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాన్ మస్క్ ట్రంప్‌ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే మస్క్‌ను తన ప్రభుత్వంలో భాగస్వామిని చేస్తానని ట్రంప్ ప్రకటించారు. ఇటీవల ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాన్ని మస్క్ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. అలాగే రిపబ్లికన్ పార్టీ నుంచి జేడీ వాన్స్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయడాన్ని మస్క్ ప్రశంసించారు.

Joe Biden: కళ్లు చెమర్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఎందుకంటే?


మొదటిసారికాదు..

ఎలాన్ మస్క్‌కు తన ప్రభుత్వంలో కీలక పదవి ఇస్తానని ట్రంప్ ప్రకటించడం ఇది మొదటిసారి కాదు. 2016లో అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత రెండు కీలక మండళ్లకు మస్క్‌ను ఎంపిక చేశారు. కానీ పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి బయటకు రావాలనే ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మస్క్ 2017లోనే రాజీనామా చేశారు. తాజాగా మరోసారి తాను అధ్యక్షుడిగా గెలిస్తే తమ ప్రభుత్వంలో మస్క్‌ను భాగస్వామిని చుస్తామని ట్రంప్ తెలిపారు.

Kamala Harris: కమలా హ్యారీస్ సర్‌ప్రైజ్ ప్రసంగం.. అధ్యక్షుడు జో బైడెన్‌పై ప్రశంసల జల్లు


రెడీ అంటూ..

తనను కేబినెట్‌లో తీసుకుంటానంటూ ట్రంప్ చేసిన ప్రతిపాదనపై ఎలాన్ మస్క్ స్పందించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీకి నేతృత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా తెలిపారు. ఆ బాధ్యతల్లో ప్రసంగిస్తున్నట్లు ఉన్న ఓ ఫోటోను ఆయన పోస్ట్‌కు జత చేశారు. ప్రభుత్వం పెట్టుబడులను క్రమబద్దీకరించి.. వృథాను అరికట్టేలా ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ట్రంప్‌తో ఇటీవల జరిగిన ఓ చర్చలో మస్క్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

Kamala Harris: కమలా హ్యారిస్‌కు గుడ్‌న్యూస్.. తాజా సర్వే ఏం చెబుతోందంటే?

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More International News and Latest Telugu News

Updated Date - Aug 20 , 2024 | 11:43 AM